Share News

కానిస్టేబుల్‌ అభ్యర్థులకు ముగిసిన దేహదారుఢ్య పరీక్షలు

ABN , Publish Date - Jan 19 , 2025 | 12:16 AM

కాకినాడ క్రైం, జనవరి 17(ఆంధ్రజ్యోతి): కానిస్టేబుల్‌ నియామక ఎంపిక ప్రక్రియలో భాగంగా జరుగుతున్న పురుష, మహిళల దేహదారుఢ్య పరీక్షలు శనివారంతో ముగిశాయి. ఏ పీఎస్పీ ఐఆర్‌ బెటాలియన్‌లో 630 కానిస్టేబుళ్లు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లావ్యాప్తంగా 381 సివిల్‌ కానిస్టేబుళ్లు పోస్టుల భర్తీకిగాను జరిగిన

కానిస్టేబుల్‌ అభ్యర్థులకు ముగిసిన దేహదారుఢ్య పరీక్షలు
పరుగు పందెంలో పురుష అభ్యర్థులు

కాకినాడ క్రైం, జనవరి 17(ఆంధ్రజ్యోతి): కానిస్టేబుల్‌ నియామక ఎంపిక ప్రక్రియలో భాగంగా జరుగుతున్న పురుష, మహిళల దేహదారుఢ్య పరీక్షలు శనివారంతో ముగిశాయి. ఏ పీఎస్పీ ఐఆర్‌ బెటాలియన్‌లో 630 కానిస్టేబుళ్లు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లావ్యాప్తంగా 381 సివిల్‌ కానిస్టేబుళ్లు పోస్టుల భర్తీకిగాను జరిగిన ఈ ఎంపిక ప్రక్రియకు 6,333మంది పురుష అ భ్యర్థులు హాజరుకావాల్సి ఉండగా 4993మంది హాజరై 2857మంది అర్హత సాధించారు. 1,449 మంది మహిళా అభ్యర్థులు హాజరుకావాల్సి ఉండగా 1066మంది హాజరై 472మంది అర్హత సాధించారు. మొత్తంగా కలిపి 7,782మంది హాజరుకావాల్సి ఉండగా 6059 మంది హాజరై 3329మంది అర్హత సాధించారు. గతనెల 30న ప్రారంభమైన ఈ దేహదారుఢ్య పరీక్షలు ముగిశాయి. శనివారం పురుష, మహిళా అభ్యర్థులు కలిసి మొత్తం 564 మంది హాజరు కాగా తదుపరి పరీక్షకు 318మంది అర్హత సాఽ దించారు. పరీక్షలను కాకినాడ జిల్లా ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌,అడ్మిన్‌ ఎస్పీ ఎంజేవీ భాస్కర్‌రావ్‌, ఏఆర్‌ అడిషనల్‌ ఎస్పీ శ్రీనివాసరావ్‌ పర్యవేక్షించారు.

Updated Date - Jan 19 , 2025 | 12:17 AM