ఉత్సాహభరితంగా. ముగిసిన ఆలిండియా సివిల్ సర్వీసెస్ హాకీ టోర్నమెంట్
ABN , Publish Date - Mar 01 , 2025 | 01:19 AM
కాకినాడ జిల్లా క్రీడామైదానంలో రెండు వారాలుగా జరుగుతున్న ఆలిండియా సివిల్ సర్వీసెస్ హాకీ టోర్నమెంట్ శుక్రవారం ముగిసింది. శుక్రవారం జరిగిన ఫైనల్స్‌లో పురుషుల విభాగంలో ఢిల్లీ సెంట్రల్ సెక్రటేరియట్ టీమ్, మహిళల విభాగంలో ఒడిశా సెక్రటేరియట్ టీమ్‌లు విజేతలుగా నిలిచాయి.
కలెక్టరేట్ (కాకినాడ), ఫిబ్రవరి 28 (ఆంధ్ర జ్యోతి): కాకినాడ జిల్లా క్రీడామైదానంలో రెండు వారాలుగా జరుగుతున్న ఆలిండియా సివిల్ సర్వీసెస్ హాకీ టోర్నమెంట్ శుక్రవారం ముగిసింది. శుక్రవారం జరిగిన ఫైనల్స్‌లో పురుషుల విభాగంలో ఢిల్లీ సెంట్రల్ సెక్రటేరియట్ టీమ్, మహిళల విభాగంలో ఒడిశా సెక్రటేరియట్ టీమ్‌లు విజేతలుగా నిలిచాయి. ముగింపు వేడు కలకు ముఖ్యఅతిథిగా ఏపీ, తెలంగాణ రీజియన్ ఇన్‌కమ్ ట్యాక్స్ డైరెక్టర్ జనరల్ ఆనంద్ రాజేశ్వర్ బైవార్, అర్జున, రాజీవ్ గాంధీ ఖేల్‌రత్న అవార్డుల విజేత, ప్రముఖ హాకీ క్రీడాకారుడు ధనరాజ్ పిళ్లై హాజరై విజేతలకు, రన్నర్ అప్ టీమ్‌లకు ట్రోఫీలను అందజేశారు. అనంతరం ముఖ్య అతిథి ఆనంద్ రాజేశ్వర్ బైవార్ మాట్లా డుతూ తొలిసారి ఆతిథ్యం ఇచ్చి టోర్నమెంట్‌ను విజయవంతం చేసిన కాకినాడ జిల్లా యంత్రాం గానికి అభినందనలు తెలిపారు. దేశంలో వివిధ రాష్ట్రాల నుంచి ఉత్సాహంగా వచ్చి క్రీడా స్ఫూర్తితో ఉత్తమ నైపుణ్యాలను ప్రదర్శించిన సివిల్ సర్వీసెస్ ఉద్యోగులను అభినందిం చారు. క్రీడల్లో గెలు పోట ములు సహజమని, క్రీడలతో మంచి శారీరక ఆరోగ్యం, మానసిక దృఢత్వం చేకూరుతుం దని పేర్కొన్నారు. మరో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ధనరాజ్ పిళ్లై మాట్లాడుతూ దేశంలో క్రికెట్ తరహాలో హాకీ క్రీడలకు క్రేజ్ లేనప్పటికీ యువత ఉత్సాహంగా పాల్గొనడం ఎంతో సంతోషమన్నారు. హాకీ క్రీడాకారులు నిరంతరం ప్రాక్టీస్ చేసి తమ నైపుణ్యా లను పెంచుకోవా లన్నారు. కార్యక్రమంలో కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్‌మోహన్, జేఎన్‌టీయూకే వైస్ చాన్సలర్ సీఎస్‌ఆర్‌కే ప్రసాద్, విశాఖ పట్నం ఇన్‌కమ్‌టాక్స్ ప్రిన్సిపల్ కమిషనర్ రాజేంద్ర కుమార్, కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, అసిస్టెంట్ కలెక్టర్ భావన తదితరులు పాల్గొన్నారు. పోటీలు ముగిసిన అనంతరం పలు సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.
టోర్నమెంట్‌లో విజేత జట్లు ఇవే..
మొదటి స్థానం: సెంట్రల్ సెక్రటేరియట్,
రెండో స్థానం: ఆర్‌ఎస్బీ హైదరాబాద్,
మూడోస్థానం: హర్యానా సెక్రటేరియట్
(పురుషుల విభాగం)
మొదటిస్థానం: ఒడిశా సెక్రటేరియట్,
రెండోస్థానం: సెంట్రల్ సెక్రటేరియట్,
మూడోస్థానం: హర్యానా సెక్రటేరియట్ (మహిళల విభాగం)
టోర్నమెంట్‌లో బహుమతులు పొందిన క్రీడాకారులు:
మహిళలు: రీతురాణా, జోనఫ్ ప్రధాన్, మౌనిక వైంగేడ్, కేఎల్ నాగలక్ష్మీ
పురుషులు: విశాల్‌సింగ్, ప్రమోద్, సూర్యప్రకాష్, దీపక్ షైనీ
బెస్ట్ టోర్నమెంట్ ఆఫ్ ది ప్లేయర్స్:
వినయ్‌రాణా (సెంట్రల్ సెక్రటేరియట్), సోనికా(సెంట్రల్ సెక్రటేరియట్). దీనిలో భా గంగా వారికి ప్రశంసాపత్రాలు అందించారు.
మూడో స్థానం కోసం రసవత్తర పోరు
మహిళల ఫైనల్స్: ఒడిశా సెక్రటేరియట్ జట్టు, సెంట్రల్ సెక్రటేరియట్ జట్లు తలపడగా ఒడిశా సెక్రటేరియట్ జట్టు 4-2 తేడాతో గెలు పొందింది. మహిళల మూడో స్థానం కోసం జరిగిన పోటీల్లో హర్యానా సెక్రటేరియట్ జట్టు, ఆం ధ్రప్రదేశ్ సెక్రటేరియట్ జట్టు తలపడగా హర్యానా 4-2 తేడాతో గెలిచింది.
పురుషుల ఫైనల్స్: సెంట్రల్ సెక్రటేరియట్ జట్టు, ఆర్‌ఎస్బీ హైదరాబాద్ జట్లు తలపడగా సెంట్రల్ సెక్రటేరియట్ జట్టు 4-2 తేడాతో గెలిచింది. పురుషుల మూడోస్థానం కోసం జరిగిన పోటీల్లో హర్యానా సెక్రటేరియట్ జట్టు, ఒడిశా సెక్రటేరియట్ జట్లు తలపడగా హర్యానా సెక్రటేరియట్ 7-2 తేడాతో గెలిచింది.