Share News

Andhra Fishermen: ప్రభుత్వం కృషితో భారత్‌కు కాకినాడ మత్స్యకారులు

ABN , Publish Date - Sep 26 , 2025 | 02:40 PM

శ్రీలంక నావికా దళం అరెస్ట్ చేసిన కాకినాడకు చెందిన నలుగురు మత్స్యకారులు విడుదలకు రంగం సిద్దమైంది. శ్రీలంక నుంచి ఈ రోజు వారు భారత్ చేరుకుంటాారు. శనివారం వారు.. స్వస్థలానికి చేరుకోనున్నారు.

Andhra Fishermen: ప్రభుత్వం కృషితో భారత్‌కు కాకినాడ మత్స్యకారులు
CM Chandrababu With MP Sana satish

అమరావతి, సెప్టెంబర్ 26: శ్రీలంక నావికా దళం అరెస్ట్ చేసిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నలుగురు మత్స్యకారులు స్వదేశానికి చేరుకోనున్నారు. శుక్రవారం సాయంత్రం శ్రీలంక నుంచి భారత్‌కు వారు చేరుకోనున్నారు. అనంతరం వారిని స్వస్థలాలకు పంపేందుకు టీడీపీ ఎంపీ సానా సతీష్ ఏర్పాట్లు చేశారు. శనివారం వారు కాకినాడ చేరుకుంటారని ఎంపీ సానా సతీష్ వివరించారు. కాకినాడకు చెందిన నలుగురు మత్స్యకారులు.. శ్రీను, వెంకటేశ్వర్, నూకరాజ్, చందా నాగేశ్వరరావు, బ్రహ్మనందం.. ఫిషింగ్ ట్రాలర్ కొనుగోలు నిమిత్తం తమిళనాడులోని నాగపట్నంకు వెళ్లారు. అనంతరం వారు తిరుగు ప్రయాణంలో.. నావిగేషన్ లోపం కారణంగా శ్రీలంక ప్రాదేశిక సముద్ర జలాల్లోకి ప్రవేశించారు. దీంతో శ్రీలంక నావికాదళం సిబ్బంది వీరిని అరెస్ట్ చేసింది.


అనంతరం వారిని జాఫ్నా జైలుకు తరలించారు. ఈ ఘటన ఆగస్టు మొదటి వారంలో చోటు చేసుకుంది. ఈ విషయం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఎంపీ సానా సతీష్ తీసుకు వెళ్లారు. వెంటనే సీఎం చంద్రబాబు రంగంలోకి దిగి.. న్యూఢిల్లీలో ఏపీ రెసిడెన్స్ కమిషనర్ అర్జా శ్రీకాంత్‌తో మాట్లాడి.. వారి విడుదలకు చర్యలు తీసుకోవాలంటూ ఆదేశించారు. అర్జా శ్రీకాంత్.. ఇండియా కోస్ట్ గార్డ్, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులతో ఆయన పలు దఫాలుగా చర్చలు జరిపారు. ఈ సందర్బంగా మత్స్యకాారుల పరిస్ధితిని వారికి వివరించారు. దీంతో వారి విడుదలకు మార్గం సుగమం అయింది.

ఈ వార్తలు కూడా చదవండి..

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలి: నారా లోకేష్

ఫీవర్‌తో బాధపడుతున్న పవన్

Read latest AP News And Telugu News

Updated Date - Sep 26 , 2025 | 03:05 PM