YD Ramarao: ఏపీ రెడ్‌క్రాస్ రాష్ట్ర శాఖ ఛైర్మన్‌గా వై.డి.రామారావు ఏకగ్రీవ ఎన్నిక
ABN , Publish Date - Jan 31 , 2025 | 10:07 PM
YD Ramarao: రెడ్ క్రాస్ సొసైటీ ఆంధ్రప్రదేశ్ శాఖ చైర్మన్‌గా వై.డి.రామారావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇప్పటి వరకు ఆ శాఖ చైర్మన్‌గా ఉన్న డాక్టర్ ఎ.శ్రీధర్ రెడ్డి.. తన పదవికి రాజీనామా చేశారు. దీంతో చైర్మన్ ఎన్నిక ఏకగ్రీవం అయింది. రెడ్ క్రాస్ సొసైటీతో వైడి రామారావుకు దాదాపు 26 ఏళ్ల అనుబంధం ఉంది.

అమరావతి, జనవరి 31: ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ చైర్మన్‌గా వై.డి.రామారావు ఎన్నికయ్యారు. విజయవాడలో శుక్రవారం జరిగిన రాష్ట్ర కార్య నిర్వాహక వర్గ సమావేశంలో రామారావును సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు. ఇప్పటి వరకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్‌గా కొనసాగిన డాక్టర్ ఎ.శ్రీధర్ రెడ్డి రాజీనామా చేశారు. ఆయన రాజీనామా చేయడంతో చైర్మన్ ఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో ఆయన స్థానంలో వై.డి.రామారావు బాధ్యతలు చేపట్టారు.
అదీకాక దాదాపు 26 సంవత్సరాల పాటు రెడ్ క్రాస్స్‌తో రామారావుకు అనుబంధం ఉంది. అలాగే గత ఎన్నిమిదేళ్లుగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్‌గా కూడా ఆయన బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ సొసైటీలో ఆయన సేవలకు గాను.. అతున్నత జాతీయ రెడ్ క్రాస్ పురస్కారం రాష్ట్రపతి బంగారు పతకాన్ని ఆయన అందుకున్నారు. అలాగే రాష్ట్రస్థాయిలో సైతం అత్యుత్తమ జిల్లా శాఖ పురస్కారాలను సతం ఆయన పొందారు. రెడ్ క్రాస్ సొసైటీ నూతన చైర్మన్‌గా ఎన్నికైన వై.డి.రామారావును పలువురు అభినందించారు.
For AndhraPradesh News And Telugu News