Share News

జనసేన కార్యాలయంపై డ్రోన్‌.. ప్రభుత్వానిదే: అదనపు ఎస్పీ రవికుమార్‌

ABN , Publish Date - Jan 21 , 2025 | 04:48 AM

మంగళగిరి ప్రాంతంలో ట్రాఫిక్‌, రోడ్లు, శానిటేషన్‌ తదితర అంశాలపై చేస్తున్న పైలెట్‌ ప్రాజెక్టులో భాగంగానే జనసేన....

జనసేన కార్యాలయంపై డ్రోన్‌.. ప్రభుత్వానిదే: అదనపు ఎస్పీ రవికుమార్‌

గుంటూరు, జనవరి 20(ఆంధ్రజ్యోతి): మంగళగిరి ప్రాంతంలో ట్రాఫిక్‌, రోడ్లు, శానిటేషన్‌ తదితర అంశాలపై చేస్తున్న పైలెట్‌ ప్రాజెక్టులో భాగంగానే జనసేన క్యాంపు కార్యాలయంపై డ్రోన్‌ ఎగరవేసినట్లు జిల్లా అదనపు ఎస్పీ రవికుమార్‌ సోమవారం స్పష్టం చేశారు. జనసేన క్యాంపు కార్యాలయంపై డ్రోన్‌ కలకలం ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేసినట్లు ఆయన తెలిపారు. పైలెట్‌ ప్రాజెక్ట్‌లో భాగంగానే ఏపీ ఫైబర్‌ నెట్‌ అధికారులు డ్రోన్‌ ఎగురవేసినట్లు నిర్ధారించామన్నారు. ఇందులో ఎటువంటి అనుమానాలు లేవని వెల్లడించారు. జనసేన క్యాంప్‌ కార్యాలయంపై డ్రోన్‌ ఎగరడంపై జనసేన నేతలు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో విచారణ జరిపామన్నారు.

Updated Date - Jan 21 , 2025 | 04:49 AM