Share News

Polling Day : 26,27 తేదీల్లో ఎమ్మెల్సీ పోలింగ్‌ జరిగే జిల్లాల్లో సెలవు

ABN , Publish Date - Feb 19 , 2025 | 06:12 AM

పోలింగ్‌ ముందు రోజు, పోలింగ్‌ రోజు, అవసరమైతే ఓట్ల లెక్కింపు రోజు స్థానిక పరిస్థితులకు అనుగుణంగా సెలవు ప్రకటించే అధికారాన్ని...

Polling Day : 26,27 తేదీల్లో ఎమ్మెల్సీ పోలింగ్‌ జరిగే జిల్లాల్లో సెలవు

  • రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వివేక్‌ యాదవ్‌

అమరావతి, ఫిబ్రవరి 18(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగే జిల్లాల్లో పోలింగ్‌ ముందు రోజు, పోలింగ్‌ రోజు, అవసరమైతే ఓట్ల లెక్కింపు రోజు స్థానిక పరిస్థితులకు అనుగుణంగా సెలవు ప్రకటించే అధికారాన్ని ఆయా జిల్లాల కలెక్టర్లకు అప్పగిస్తూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వివేక్‌యాదవ్‌ ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం ఈమేరకు ఆయన ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో ఈనెల 27న రెండు గ్రాడ్యుయేట్‌, ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలోని 16 జిల్లాల్లో 27న పోలింగ్‌ జరగనుంది. ఓట్ల లెక్కింపు మార్చి 3న జరుగుతుంది.

వక్ఫ్‌ బోర్డు సీఈవోగా మహ్మద్‌ అలీ

రాష్ట్ర వక్ఫ్‌ బోర్డు సీఈవోగా మహ్మద్‌ అలీ నియామకం అయ్యారు. మంగళవారం మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి హర్షవర్థన్‌ ఈ ఉత్తర్వులు ఇచ్చారు.

Updated Date - Feb 19 , 2025 | 08:01 AM