Dileep Granted Bail: మద్యం కేసులో దిలీప్‌కు షరతులతో బెయిల్
ABN , Publish Date - Aug 29 , 2025 | 04:45 AM
మద్యం కుంభకోణం కేసులో మొదటిసారి ఒకరికి బెయిల్ మంజూరైంది..
కసిరెడ్డి, సజ్జల బెయిల్ పిటిషన్లు కొట్టివేత
విజయవాడ, ఆగస్టు 28(ఆంధ్రజ్యోతి): మద్యం కుంభకోణం కేసులో మొదటిసారి ఒకరికి బెయిల్ మంజూరైంది. ఈ కేసులో ఏ-30గా ఉన్న పైలా దిలీ్‌పకు విజయవాడ ఏసీబీ కోర్టు షరతులతో బెయిల్ మంజూరు చేస్తూ గురువారం తీర్పు వెలువరించింది. బెయిల్ కోసం కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి (ఏ-1), సజ్జల శ్రీధర్‌రెడ్డి (ఏ-6) దాఖలుచేసిన పిటిషన్లను మాత్రం కొట్టివేసింది. దిలీ్‌పకు పలు షరతులు విధించింది. లక్ష రూపాయల చొప్పున రెండు పూచీకతులు సమర్పించాలని.. అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లకూడదని, పాస్‌పోర్టును కోర్టుకు అప్పగించాలని స్పష్టం చేసింది. దిలీప్ ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కసిరెడ్డికి పీఏ. తనకు కొత్తగా వివాహమైందని, బెయిల్ ఇవ్వాలని పలుమార్లు పిటిషన్లు దాఖలు చేశాడు. వాటిని న్యాయస్థానం కొట్టివేసింది. కొద్దిరోజుల క్రితం కసిరెడ్డి, శ్రీధర్‌రెడ్డితో పాటు మరోసారి బెయిల్ పిటిషన్ వేశాడు. వాటిపై వాదప్రతివాదనలు పూర్తికావడంతో న్యాయాధికారి తన నిర్ణయం వెల్లడించారు.
ఇవి కూడా చదవండి
బస్సు బీభత్సం.. ప్రమాదంలో ఆరుగురి మృతి, ఏడుగురికి గాయాలు
యువకుల అత్యుత్సాహం.. ప్రాణం మీదకు తెచ్చిన పందెం..