Share News

Maddikera Diamond: ఒక వజ్రం.. 30 లక్షలు

ABN , Publish Date - May 26 , 2025 | 04:11 AM

కర్నూలు జిల్లాలో వజ్రాల వేట జోరుగా సాగుతోంది. మద్దికెర, తుగ్గలి మండలాల్లో రైతులకు వజ్రాలు లభించగా, ఒకదాన్ని రూ.30 లక్షలకు విక్రయించినట్లు సమాచారం.

Maddikera Diamond: ఒక వజ్రం.. 30 లక్షలు

మద్దికెర/తుగ్గలి, మే 25(ఆంధ్రజ్యోతి): కర్నూలు జిల్లాలోని పలు గ్రామాల్లో ఖాళీ భూముల్లో వజ్రాల వేట జోరుగా సాగుతోంది. ఈ వేటలో మూడు వజ్రాలు లభ్యమైనట్లు సమాచారం. మద్దికెర మండలంలోని పెరవలిలో అదే గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీకి వజ్రం దొరకగా రూ.1.5 లక్షలకు, ఇతర ప్రాంతం నుంచి ఓ వ్యక్తికి దొరికిన వజ్రాన్ని రూ.30 లక్షలకు వ్యాపారులు కొనుగోలు చేసినట్లు సమాచారం. తుగ్గలి మండలంలోని జొన్నగిరిలో ఓ వ్యవసాయ కూలీకి వజ్రం దొరకగా.. రూ.1.3 లక్షలకు అమ్మినట్లు తెలిసింది. మద్దికెర, తుగ్గులి మండల్లాలో వజ్రాలు దొరుకుతున్నాయని చుట్టుపక్కల ప్రాంతాల వారే కాకుండా అనంతపురం, బళ్లారి, నంద్యాల, గుంటూరు, కర్నూలు, విజయవాడ తదితర సూదూర ప్రాంతాల నుంచి ప్రజలు తరలివస్తున్నారు. ఇలా సుదూర ప్రాంతా ల నుంచి వచ్చే వారికి వ్యాపారులు వసతి కూడా కల్పిస్తున్నారు.

Updated Date - May 26 , 2025 | 04:13 AM