DGP Harish Kumar Gupta: రౌడీషీటర్లను ఉపేక్షించకండి.. మీ వెనుక నేనున్నా
ABN , Publish Date - Aug 29 , 2025 | 03:57 AM
కిలేడీ అరుణ, రౌడీషీటర్ శ్రీకాంత్ వ్యవహారాలపై డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తా ఆరా తీశారు...
నెల్లూరు పోలీసులకు డీజీపీ భరోసా.. అరుణ, శ్రీకాంత్‌పై ఆరా
నెల్లూరు క్రైం, ఆగస్టు 28(ఆంధ్రజ్యోతి): కి‘లేడీ’ అరుణ, రౌడీషీటర్ శ్రీకాంత్ వ్యవహారాలపై డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తా ఆరా తీశారు. గురువారం ఆయన తిరుపతికి వెళ్తూ మార్గమధ్యంలో నెల్లూరు వచ్చారు. పోలీసు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే రౌడీలు, ట్రబుల్ మాంగర్స్‌ను ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించరాదని, వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. అవసరమైతే వారి ఆస్తులను కూడా జప్తు చేయాలన్నారు. ‘రౌడీషీటర్ల కోసం ఏ రాజకీయ నాయకుడూ ఫోన్ చేయడు... మీ వెనుక నేనున్నాను... రౌడీషీటర్ల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలి..’ అని స్పష్టం చేశారు
ఇవి కూడా చదవండి
బస్సు బీభత్సం.. ప్రమాదంలో ఆరుగురి మృతి, ఏడుగురికి గాయాలు
యువకుల అత్యుత్సాహం.. ప్రాణం మీదకు తెచ్చిన పందెం..