Pawan Kalyan: సీఎం అవ్వాలంటే బాబాయ్‌ని చంపేయాలా..
ABN , Publish Date - Mar 14 , 2025 | 10:20 PM
రాజకీయాల్లో పవర్ కోసం పని చేయాలి.. లేదా బలమైన సైద్ధాంతికం ఉండాలని అన్నారు పవన్ కల్యాణ్. పవర్ కోసం మర్డర్లు చేయిస్తాం.. వేల కోట్లు దోచేస్తాం.. కులాలను కెలికేస్తాం.. రకరకాలుగా లాభపడతాం, కోడి కత్తిని వాడుకుంటాం.. అంటే నడవదని..

కాకినాడ, మార్చి 14: వైసీపీ అధినేత జగన్‌పై ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. జగన్‌పై హాట్ కామెంట్స్ చేశారు. పార్టీ పెట్టాలంటే నాన్న సీఎం అయ్యిండాలా.. బాబాయిని చంపించి ఉండాలా.. అలా అని ఎక్కడా రాసి లేదు కదా.. అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు పవన్. దశాబ్దం పాటు పార్టీని నపడాలంటే ఎన్ని తిట్లు తినాలి.. వ్యక్తిగత జీవితం నుంచి ఆరోగ్యం వరకు ఎన్నో పోగొట్టున్నానని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు. మార్షల్ ఆర్ట్స్‌లో మూడు గ్రానైట్ రాళ్లు పెట్టి పగులకొట్టించుకున్న తాను.. ఇప్పుడు తన రెండో కొడుకుని ఎత్తుకోలేనంత బలహీనపడినట్లు తెలిపారు. ప్రజలందరి ఆశీర్వాదంతో మళ్లీ బలం తెచ్చుకుంటానని పవన్ పేర్కొన్నారు.
రాజకీయాల్లో పవర్ కోసం పని చేయాలి.. లేదా బలమైన సైద్ధాంతికం ఉండాలని అన్నారు పవన్ కల్యాణ్. పవర్ కోసం మర్డర్లు చేయిస్తాం.. వేల కోట్లు దోచేస్తాం.. కులాలను కెలికేస్తాం.. రకరకాలుగా లాభపడతాం, కోడి కత్తిని వాడుకుంటాం.. అంటే నడవదని.. అలాంటి వాటిని తాను ఎంచుకోలేదంటూ పరోక్షంగా వైఎస్ జగన్‌పై విరుచుకుపడ్డారు. తాను సైద్ధాంతిక రాజకీయాన్ని ఎన్నుకున్నానని.. అందుకే దేశ భద్రత కోసం ఆలోచిస్తానని పవన్ చెప్పుకొచ్చారు. రిజిస్ట్రార్ పార్టీ నుంచి రికగ్నైజ్డ్ పార్టీగా జనసేన ఎదిగిందని చెప్పారు. ఎలా మార్చేసుకుంటావని ఏదో మాట్లాడేస్తుంటారని ప్రత్యర్థుల మాటను పవన్ ఉటంకించారు. తాను సమాజంలో మర్పు కోసం పని చేయాలని వచ్చినవాడిని.. ఓట్ల కోసం వచ్చిన వాడిని కాదన్నారు. రాజకీయాల్లో పవర్ కోసం పని చేయాలి.. లేదా బలమైన సైద్ధాంతికం ఉండాలన్నారు. రిజిస్ట్రార్ పార్టీ నుంచి రికగ్నైజ్డ్ పార్టీగా జనసేన ఎదిగిందన్నారు. ఇన్ని మాట్లాడే ఇంగ్లీష్ పేపర్ వాళ్లు ఒకసారి ఆలోచన చేసుకోండని జాతీయ మీడియాకు పవన్ కల్యాణ్ చురకలంటించారు.