Share News

May Day Celebration: ఉపాధి శ్రామికులతో పవన్‌ ఆత్మీయ కలయిక

ABN , Publish Date - May 01 , 2025 | 05:07 AM

మేడే సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ మంగళగిరిలో ఉపాధి శ్రామికులతో ఆత్మీయ కలయిక కార్యక్రమం నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 260 మంది శ్రామికులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.

May Day Celebration: ఉపాధి శ్రామికులతో పవన్‌ ఆత్మీయ కలయిక

  • నేడు మంగళగిరిలో మేడే కార్యక్రమం

అమరావతి, ఏప్రిల్‌ 30 (ఆంధ్రజ్యోతి): మేడే సందర్భంగా పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ ఉపాధి శ్రామికులతో ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ ఆత్మీయ కలయిక కార్యక్రమాన్ని గురువారం మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌లో ఏర్పాటు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కో జిల్లా నుంచి పది మంది చొప్పున సుమారు 260 మంది ఉపాధి శ్రామికులు ఇందులో పాల్గొంటారు. వందరోజులు పనులుచేసిన ఉపాధి శ్రామికులకు ఈ అవకాశం కల్పిస్తున్నారు. ప్రతి జిల్లా నుంచి ఒక అడిషనల్‌ ప్రాజెక్డు డైరక్టర్‌ బాధ్యత తీసుకుని శ్రామికులను మంగళగిరికి తీసుకొస్తున్నారు. ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు శ్రామికులతో పవన్‌కల్యాణ్‌ స్వయంగా ముచ్చటిస్తారు.


Also Read:

సామ్ కర్రన్ సూపర్ ఇన్నింగ్స్.. ఛాహల్ హ్యాట్రిక్

రిటైర్మెంట్‌పై బాంబు పేల్చిన ధోని

ఇలాంటి దోపిడీ ఎక్కడైనా చూశారా..

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - May 01 , 2025 | 05:09 AM