Share News

Ministerial Staff deputation: జడ్పీ సీఈఓలు మార్గదర్శకాలు పాటించాలి

ABN , Publish Date - May 17 , 2025 | 04:09 AM

జిల్లా పరిషత్ సీఈఓలకు హెచ్‌ఓడీ అనుమతి లేకుండా మినిస్టీరియల్ సిబ్బందిని ఇతర శాఖలకు డిప్యూటేషన్‌కు పంపరాదు అని కమిషనర్ కృష్ణతేజ ఆదేశించారు. డిప్యూటేషన్‌లో ఉన్న సిబ్బంది వివరాలను వెంటనే కమిషనరేట్‌కు తెలియజేయాలని ఆదేశించారు.

Ministerial Staff deputation: జడ్పీ సీఈఓలు మార్గదర్శకాలు పాటించాలి

పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌

అమరావతి, మే 16(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వ్యాప్తంగా మండల, జిల్లా పరిషత్‌లలో పనిచేస్తున్న మినిస్టీరియల్‌ సిబ్బందిని ఇతర శాఖలకు డిప్యూటేషన్‌పై పంపేందుకు ఉన్న మార్గదర్శకాలను పాటించాలని జిల్లా పరిషత్‌ సీఈఓలకు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ కృష్ణతేజ ఆదేశాలిచ్చారు. హెచ్‌ఓడీ అనుమతి లేకుండా జడ్పీ/ఎంపీపీ సిబ్బంది పలువురిని డిప్యూటేషన్‌పై ఇతర శాఖలకు అనుమతించినట్లు సమాచారం కమిషనరేట్‌కు చేరడంతో ఆ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇతర శాఖల్లో డిప్యూటేషన్‌పై పనిచేస్తున్న జడ్పీ/ఎంపీపీ కార్యాలయం సిబ్బంది వివరాలను వెంటనే కమిషనరేట్‌కు పంపించాలని కమిషనర్‌ ఆదేశించారు. ఇక నుంచి ఒక్క ఉద్యోగిని కూడా హెచ్‌ఓడీ అనుమతి లేకుండా డిప్యూటేషన్‌కు అనుమతించరాదన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

Vamsi Remand News: వంశీకి రిమాండ్‌లో మరో రిమాండ్

Minister Lokesh: రెన్యూవబుల్ పరిశ్రమ మాత్రమే కాదు.. ఉద్యమం

Liquor Scam Arrests: ఏపీ లిక్కర్‌ స్కాంలో మరిన్ని అరెస్ట్‌లు.. జోరుగా చర్చ

Amaravati: ప్రమాదకరంగా అమరావతి కరకట్ట రోడ్డు

For More AP News and Telugu News

Updated Date - May 17 , 2025 | 04:09 AM