Aravind Babu: ఎమ్మెల్యే చదలవాడపై సీఎం సీరియస్
ABN , Publish Date - Mar 08 , 2025 | 04:29 AM
ఎమ్మెల్యే ప్రవర్తన పార్టీ నియమావళికి విరుద్ధంగా ఉందని, పార్టీ ప్రతిష్ఠను దిగజార్చేలా ఉందని భావిస్తోంది. శుక్రవారం ఉదయం ఢిల్లీ నుంచి వచ్చిన వెంటనే చంద్రబాబు ఎమ్మెల్యే గొడవపై పార్టీ నేతల నుంచి సమాచారం తెప్పించుకున్నారు.
వివరణ కోరాలని పల్లాకు ఆదేశం
అమరావతి, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): నరసరావుపేట టీడీపీ ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబుపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఎక్సైజ్ కమిషనరేట్ కార్యాలయంలో గురువారం ఆయన వ్యవహరించిన తీరుపై వివరణ తీసుకోవాలని ఆ పార్టీ అధిష్ఠానం నిర్ణయించింది. ఎమ్మెల్యే ప్రవర్తన పార్టీ నియమావళికి విరుద్ధంగా ఉందని, పార్టీ ప్రతిష్ఠను దిగజార్చేలా ఉందని భావిస్తోంది. శుక్రవారం ఉదయం ఢిల్లీ నుంచి వచ్చిన వెంటనే చంద్రబాబు ఎమ్మెల్యే గొడవపై పార్టీ నేతల నుంచి సమాచారం తెప్పించుకున్నారు. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను తొలగించి.. తాను చెప్పినవారినే నియమించాలని ఎమ్మెల్యే డిమాండ్ చేయడమే కాకుండా ఎక్సైజ్ కమిషనరేట్‌లో ఆయన ప్రవర్తన.. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, సంబంధిత శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఫోన్ చేసినా స్పందించకపోవడాన్ని సీఎం తీవ్రంగా పరిగణించారు. ఎమ్మెల్యే నుంచి లిఖితపూర్వకంగా వివరణ తీసుకోవాలని పల్లా శ్రీనివాసరావును ఆదేశించారు. వివరణపై సంతృప్తి చెందకపోతే క్రమశిక్షణ కమిటీ ముందుకు రప్పించాలని సూచించారు.
ఇవి కూడా చదవండి...
Also Read: వేయించిన తెల్ల నువ్వులు, బెల్లం కలిపి తీసుకుంటే ఇన్ని ప్రయోజనాలా..
Also Read: తమిళనాడు సీఎం ఏంకే స్టాలిన్ కీలక నిర్ణయం.. సీఎంలకు లేఖ
Also Read: పోసానికి గుడ్ న్యూస్ కానీ.. జైల్లోనే..
Also Read : రంగయ్య మృతి.. సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం
మరిన్ని ఏపీ వార్తలు కోసం క్లిక్ చేయండి..