Etikoppaka Bommalu: పరేడ్‌లో శకటానికి బహుమతి.. స్పందించిన సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Jan 29 , 2025 | 07:16 PM
Etikoppaka Bommalu: దేశ రాజధాని న్యూఢిల్లీలో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రదర్శితమైన ఏటికొప్పాక శకటం అందరి మదిని దోచింది. ఈ శకటం బహుమతిని సైతం గెలుచుకొంది. ఈ మేరకు రక్షణ మంత్రిత్వ శాఖ బుధవారం ప్రకటించింది.
అమరావతి, జనవరి 29: దేశ రాజధాని న్యూఢిల్లీలో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ తరఫున ప్రదర్శించిన ఏటికొప్పాక బొమ్మల శకటం బహుమతిని గెలుచుకొంది. ఈ శకటానికి జ్యూరీ అవార్డును కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రానికి చెందిన శకటం బహుమతి గెలుచుకోవడంపై ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు బుధవారం అమరావతిలో స్పందించారు.
30 ఏళ్ల తర్వాత ఏపీ శకటానికి కేంద్ర పురస్కారం లభించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పరేడ్‌లో యావత్ దేశాన్ని ఏపీ శకటం ఆకట్టుకుందని ఆయన తెలిపారు. ఏటికొప్పాక బొమ్మల రాజసానికి నెటిజన్లు ఫిదా అయ్యారని సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా పేర్కొన్నారు.
మరోవైపు ఏపీ శకటానికి బహుమతి రావడంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. ప్రపంచ ప్రఖ్యాత గాంచిన ఏటికొప్పాక బొమ్మలతో రూపొందించిన శకటానికి బహుమతి రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీలకు ఆయన ప్రభుత్వం తరఫున ధన్యవాదాలు తెలిపారు.
Also Read: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌కు కేంద్ర మంత్రులు.. అసలు విషయం ఇదే
కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత.. ఈ బొమ్మలకు ప్రాచుర్యం కల్పించేందుకు చర్యలు చేపట్టినట్లు ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వెల్లడించారు. గణతంత్ర దినోత్సవంలో ప్రదర్శించిన శకటాల్లో ఆంధ్రప్రదేశ్‌కు మూడో స్థానంలో నిలిచింది. తొలి, ద్వితీయ స్థానాల్లో ఉత్తరప్రదేశ్, త్రిపుర రాష్ట్రాలు నిలిచాయి. ఏపీ ప్రదర్శించిన ఏటికొప్పాక బొమ్మల శకటానికి మూడో స్థానం దక్కింది. ఈ మేరకు పరేడ్ శకటాల ఫలితాలను రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
Also Read: పంచగ్రామాల ప్రజలకు గుడ్ న్యూస్
Also Read: ఆన్‌లైన్ మోసాలకు పాల్పడుతోన్న ముఠా గుట్టను రట్టు చేసిన పోలీసులు
గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. జనవరి 26వ తేదీన జరిగిన ఈ రిపబ్లిక్ డే వేడుకల్లో వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి వచ్చిన శకటాలతో పరేడ్ నిర్వహించారు. ఈ పరేడ్‌లో ఆంధ్రప్రదేశ్‌కు ప్రాతినిధ్యంగా నిలిచిన ఏటికొప్పాక బొమ్మల శకటం హైలెట్‌గా నిలిచింది.
Also Read: జాతీయ క్రీడల జరుగుతోన్న వేళ.. ఏపీ హైకోర్టు కీలక తీర్పు
Also Read: హైకోర్టు తీర్పుపై స్పందించిన జ్యోతి సురేఖ
ప్రధాని నరేంద్ర మోదీతో పాటుగా రిపబ్లిక్ డే వేడుకలను వీక్షించేందుకు తరలి వచ్చిన అతిథులను సైతం ఈ ఏపీ శకటం కట్టిపడేసింది. ఏటికొప్పాక బొమ్మలతో రూపొందించిన ఈ శకటం.. రిపబ్లిక్ డే వేడుకల్లో కేంద్ర బిందువుగా నిలిచింది.
Also Read: మీకు వాట్సాప్ ఉంటే చాలు.. మీ ఫోన్‌లోనే ప్రభుత్వం
మరోవైపు త్రివిధ దళాల్లో జమ్మూకశ్మీర్ రైఫిల్స్ కవాతు బృందానికి బహుమతి దక్కింది. అలాగే కేంద్ర బలగాల విభాగంలో దిల్లీ పోలీసు కవాతు బృందానికి ఉత్తమ మార్చింగ్ కంటింజెంట్‌గా బహుమతి దక్కినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
For AndhraPradesh News And Telugu News