Share News

Minister Anam Ramnarayan Reddy : రాష్ట్ర పండుగగా రథసప్తమి

ABN , Publish Date - Feb 05 , 2025 | 05:12 AM

రథసప్తమి పర్వదినాన్ని రాష్ట్ర పండువగా నిర్వహిస్తున్నట్లు దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు.

Minister Anam Ramnarayan Reddy : రాష్ట్ర పండుగగా రథసప్తమి

  • దేవదాయ శాఖ మంత్రి ఆనం

నెల్లూరు(సాంస్కృతికం), ఫిబ్రవరి 4(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో ఈ ఏడాది నుంచి రథసప్తమి పర్వదినాన్ని రాష్ట్ర పండువగా నిర్వహిస్తున్నట్లు దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. మంగళవారం నెల్లూరులోని మూలాపేట శివాలయంలోని సూర్యదేవాలయంలో మంత్రి పూజలు చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర పండువగా రథసప్తమిని అరసవెల్లి సూర్యదేవాలయం నుంచి శ్రీకారం చుట్టినట్టు తెలిపారు. రాబోయే మహాశివరాత్రికి శైవక్షేత్రాలలో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. శ్రీకాళహస్తి, మహానంది, కోటప్పకొండ, ద్రాక్షారామం, ప్రసిద్ధ క్షేత్రాల్లో విస్తృత ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. భవిష్యత్‌ తరాలకు మన ఆలయాల విశిష్టత, చరిత్ర తెలిసేలా వేదాలు, ఆగమ శాస్త్రాలను తూచా తప్పకుండా పాటిస్తూ సనాతన హిందూ ధర్మపరిరక్షణే లక్ష్యంగా తమ ప్రభుత్వం ధృడసంకల్పంతో కృషి చేస్తోందని అన్నారు.

Updated Date - Feb 05 , 2025 | 05:13 AM