79th Independence Day: 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.. సీఎం చంద్రబాబు షెడ్యూల్ ఇదే..
ABN , Publish Date - Aug 15 , 2025 | 08:31 AM
79th Independence Day: 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ‘స్త్రీ శక్తి’ పథకాన్ని అమలు చేయనున్నారు. ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు షెడ్యూల్ వివరాలు ఇలా ఉన్నాయి.
79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ‘స్త్రీ శక్తి’ పథకాన్ని అమలు చేయనున్నారు. ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు షెడ్యూల్ వివరాలు ఇలా ఉన్నాయి. ఉదయం 8 గంటల 43 నిమిషాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉండవల్లి నివాసం నుంచి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియానికి బయలుదేరుతారు. 9 గంటలకు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియానికి చేరుకుంటారు. అక్కడ జరిగే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
11 గంటలకు సీఎం చంద్రబాబు ఉండవల్లి నివాసానికి తిరిగి వెళ్లిపోతారు. మధ్యాహ్నం 3 గంటలకు ఉండవల్లి బస్టాండుకు వెళతారు. ఉండవల్లి బస్టాండ్ నుంచి ఆర్టీసీ బస్సులో పండిట్ నెహ్రూ బస్ స్టేషన్‌కు వెళతారు. మధ్యాహ్నం 3:30 గంటలకు మహిళలకు ఉచిత బస్సు హామీ అమల్లో భాగంగా "స్త్రీ శక్తి" పథకాన్ని ప్రారంభిస్తారు. 5.10 నిమిషాలకు ఉండవల్లి నివాసానికి చేరుకుంటారు. సాయంత్రం 6 గంటలకు రాజ్ భవన్‌లో జరగనున్న ఎట్ హోం కార్యక్రమానికి హాజరు అవుతారు. 6:40 గంటలకు రాజ్ భవన్ నుంచి విజయవాడ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుండి హైదరాబాద్ వెళతారు.
సీఎం రేవంత్ రెడ్డి షెడ్యూల్ వివరాలు..
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఉదయం 9 గంటలకు జూబ్లీహిల్స్ నివాసంలో జాతీయ జెండా ఎగరవేస్తారు. 10 గంటలకు గోల్కొండ కోటలో జెండా ఆవిష్కరించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు హైటెక్స్‌లో క్రెడాయ్ ప్రాపర్టీ షోను ప్రారంభించనున్నారు. సాయంత్రం రాజ్ భవన్‌లో ఎట్ హోమ్‌కు హాజరుకానున్నారు.
ఇవి కూడా చదవండి
దేశ ప్రజల క్షేమమే మా ధ్యేయం.. స్వాతంత్ర్య వేడుకల్లో మోదీ ప్రసంగం..
మరణాన్ని అనుభూతి చెందిన మహిళ.. ఏం చూసిందంటే..