Share News

Near Passed Away experience: మరణాన్ని అనుభూతి చెందిన మహిళ.. ఏం చూసిందంటే..

ABN , Publish Date - Aug 15 , 2025 | 07:40 AM

Near Passed Away experience: కుటుంబసభ్యులు నికోలాను ఆష్‌ఫోర్డ్ కెంట్‌లో ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో ఆమె కోమాలోకి వెళ్లింది. డాక్టర్లు చేతులెత్తేశారు. నికోలా బతికే అవకాశం 20 శాతం మాత్రమే అని చెప్పారు.

Near Passed Away experience: మరణాన్ని అనుభూతి చెందిన మహిళ.. ఏం చూసిందంటే..
Near Passed Away experience

‘మరణం అంతం కాదు ఆరంభం’ అని చాలా మతాల్లో ఓ నమ్మకం ఉంది. ఆ నమ్మకం ప్రకారం మనిషి చనిపోయిన తర్వాత ఆత్మ వేరే శరీరాన్ని చేరుకుంటుంది. అయితే, కొన్ని సార్లు మనిషి చనిపోయిన వెంటనే ఆత్మ వేరే శరీరాన్ని చేరుకోలేదు. కొంత సమయం బయటి ప్రపంచంలో తిరుగుతుంది. ఇలాంటి పరిస్థితి చనిపోయిన వారి ఆత్మలే కాదు.. చావు అంచుల వరకు వెళ్లి వచ్చిన వారి ఆత్మలు కూడా అనుభూతి చెందుతాయి. దాన్నే ‘నియర్ డెత్ ఎక్స్‌పీరియన్స్’ అంటారు.


తాజాగా, బ్రిటన్‌కు చెందిన 32 ఏళ్ల నికోలా హడ్జెస్ ‘నియర్ డెత్ ఎక్స్‌పీరియన్స్’ను అనుభూతి చెందింది. నికోలాకు ఎపిలిప్సీ ఉంది. దానికి మందులు కూడా వాడుతోంది. అయితే, ఎపిలిప్సీ మందుల్లో మార్పుల వల్ల ఆమె ఆరోగ్యందెబ్బ తింది. స్ప్రహతప్పిపడిపోయింది. కుటుంబసభ్యులు ఆమెను ఆష్‌ఫోర్డ్ కెంట్‌లో ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో ఆమె కోమాలోకి వెళ్లింది. డాక్టర్లు చేతులెత్తేశారు. నికోలా బతికే అవకాశం 20 శాతం మాత్రమే అని చెప్పారు.


అయితే, ఊహించని విధంగా ఆమె కోమాలోంచి అతి త్వరగా బయటకు వచ్చేసింది. కుటుంబసభ్యులు, డాక్టర్లు కూడా ఆశ్చర్యపోయారు. నికోలా తన ఆరోగ్యం కుదుటపడ్డాక నియర్ డెత్ ఎక్స్‌పీరియన్స్ గురించి చెప్పుకొచ్చింది. ఆమె మాట్లాడుతూ.. ‘నేను కోమాలో ఉన్నపుడు పరిస్థితి ఎలా ఉందో చెప్పాలంటే.. ఒకరకంగా అది నియర్ డెత్ ఎక్స్‌పీరియన్స్ అని చెప్పొచ్చు. అయితే, అది మీరు ఇప్పటి వరకు విన్న విధంగా లేదు. అక్కడ తెల్లటి ముత్యాల గేట్లు లేవు. నేను ఏదీ చూడలేదు. నేను వెచ్చదనాన్ని, తెల్లటి కాంతిని మాత్రమే అనుభూతి చెందగలిగాను. చనిపోయిన తర్వాత ఏదో ఉంటుందని మాత్రం నాకు అర్థం అయింది. మరో జీవితం లేదా శక్తి ఏదో ఒకటి ఉంటుంది’ అని అంది.


ఇవి కూడా చదవండి

పిచ్చి పీక్స్.. వైరల్ లబూబు బొమ్మకు పూజలు..

నేడే స్త్రీ(ఫ్రీ) శక్తి..

Updated Date - Aug 15 , 2025 | 08:15 AM