CM Chandrababu Naidu: ప్రస్తుత రాజకీయాలు చూస్తుంటే బాధేస్తోంది
ABN , Publish Date - Aug 04 , 2025 | 09:06 PM
దివి సీమ గాంధీగా మండల వెంకట కృష్ణారావు ప్రజల గుండెల్లో ఉండిపోయారని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆయనతో కలిసి తాను ఎమ్మెల్యేగా పని చేశానని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు గుర్తు చేసుకున్నారు.
అమరావతి, ఆగస్ట్ 04: ఒకప్పుడు విలువలతో కూడిన రాజకీయాలు చూశానని.. కానీ ప్రస్తుతం రాజకీయాలు చూస్తుంటే బాధేస్తుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. సోమవారం విజయవాడలో మాజీ మంత్రి మండలి వెంకట కృష్ణారావు శతజయంతి ఉత్సవాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా లైట్ హౌస్ ఇన్ ది స్ట్రామ్ (A Lighthouse in the Storm) పుస్తకాన్ని సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు.
అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. దివి సీమ గాంధీగా మండల వెంకట కృష్ణారావు ప్రజల గుండెల్లో ఉండిపోయారన్నారు. మండల వెంకట కృష్ణారావుతో కలిసి తాను ఎమ్మెల్యేగా పని చేశానని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. గాంధీజీ ఆశయాలను తూచా తప్పకుండా ఆచరించిన వ్యక్తి మండల కృష్ణారావు అని ఆయన పేర్కొన్నారు.
ఎందరో మహానుభావులకు నిలయం కృష్ణాజిల్లా అని చెప్పారు. సమాజానికి ఎక్కడ ఇబ్బంది వచ్చినా తనకు వచ్చిన ఇబ్బందిగా భావించి పని చేసిన వ్యక్తి మండలి వెంకట కృష్ణారావు అని తెలిపారు. విద్య శాఖ మంత్రిగా పని చేసే సమయంలో.. అనేక సంస్కరణలకు మండలి కృష్ణారావు ఆద్యుడని పేర్కొన్నారు.
తెలుగు భాషా సంస్కృతికి పని చేసిన వ్యక్తి ఆయన అని చెప్పారు. ప్రపంచ తెలుగు మహాసభలను తెలుగు వారికి పరిచయం చేసిన వ్యక్తి కూడా మండల కృష్ణారావేనని పేర్కొన్నారు. మండల కృష్ణారావు లక్షణాలు కుమారుడు మండల బుద్ధ ప్రసాద్‌కి కూడా వచ్చాయని ప్రశంసించారు. దేశంలో కుటుంబ వ్యవస్థ ఉన్న ఏకైక దేశం భారత్ అని అన్నారు.
అమెరికాలో తెలుగు వారి తలసరి ఆదాయం ఆ దేశం కంటే ఎక్కువ వస్తుందని చెప్పారు. అమెరికాలో ఇండియన్స్‌కి ఉద్యోగాలు ఇవ్వొద్దంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాత్కాలింగా చెప్పినా.. మనం లేకపోతే వాళ్లకి పనులు జరగవని వివరించారు. మన అవసరాలు వాళ్లకు ఉన్నాయి ఇవి మర్చిపోతున్నారన్నారు.
ఒకప్పుడు బిల్ గేట్స్ ఒక మాట అన్నారు... ప్రభుత్వం ఆంక్షలు పెడితే తాను ఇండియా వెళ్లి కంపెనీ పెడతానని చెప్పి.. హైదరాబాదులో మైక్రోసాఫ్ట్ కంపెనీ స్థాపించారని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
For More AP News and Telugu News