Share News

Birthday: వేమూరి రాధాకృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు..

ABN , Publish Date - Jun 20 , 2025 | 07:11 PM

తెలుగు జర్నలిజంలో కలికితురాయి.. డైనమిక్ పర్సన్.. భయమెరుగని మేరునగధీరుడు ఏబీఎన్-ఆంధ్రజ్యోతి సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ పుట్టిన రోజు నేడు. ఆయన జన్మదినం సందర్భంగా ప్రముఖులు మొదలు.. సామాన్యుల వరకు..

Birthday: వేమూరి రాధాకృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు..
CM Chandrababu Naidu

అమరావతి, జులై 20: తెలుగు జర్నలిజంలో కలికితురాయి.. డైనమిక్ పర్సన్.. భయమెరుగని మేరునగధీరుడు ఏబీఎన్-ఆంధ్రజ్యోతి సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ పుట్టిన రోజు నేడు. ఆయన జన్మదినం సందర్భంగా ప్రముఖులు మొదలు.. సామాన్యుల వరకు బర్త్ డే విషెష్ చెబుతున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా వేమూరి రాధాకృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ వేదికగా విషెష్ చెబుతూ పోస్ట్ చేశారు.


సీఎం చంద్రబాబు పోస్ట్ ఇదే..

‘ఆగ్రశ్రేణి దినపత్రిక ఆంధ్రజ్యోతి ఎండీ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ వ్యవస్ధాపకులు వేమూరి రాధకృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు. తనదైన శైలిలో జర్నలిజంలో రాణించడమే కాకుండా ఎన్నో రాజకీయ, సామాజిక అంశాలలో తన అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా చెప్పే ఆయన మరిన్ని ఉన్నత శిఖరాలను అదిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆయురారోగ్యాలతో పాటు తన నిఖార్సైన జర్నలిజంతో మరింత సామాజిక సేవ చేసే భాగ్యాన్ని ఆ దేవదేవుడు ఆయనకు ప్రసాదించాలని ఆకాంక్షిస్తున్నాను.’ అంటూ @abntelugutv హ్యాష్ ట్యాగ్‌ను ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేశారు సీఎం చంద్రబాబు.


మంత్రి లోకేష్ విషెష్..

మంత్రి నారా లోకేష్ కూడా వేమూరి రాధాకృష్ణకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ‘ప్రజల పక్షాన నిలిచే దమ్ము, వాస్తవాలను చూపించే ధైర్యం, నిజాలను నిర్భీతిగా ప్రసారం చేసే ఏబీఎన్, ఆంధ్రజ్యోతి సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆర్కేగారు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. హ్యాపీ బర్త్ డే సార్.’ అంటూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు మంత్రి.


Also Read:

అమ్మాయిల భీకర పోరు.. ఎవ్వరూ తగ్గట్లేదుగా..

ఏపీ సీఎం చంద్రబాబుతో బనకచర్లపై చర్చలకు సిద్ధం

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Jun 20 , 2025 | 07:15 PM