CM Chandrababu : స్వచ్ఛాంధ్ర అందరి బాధ్యత
ABN , Publish Date - Feb 15 , 2025 | 04:40 AM
లక్ష్యా లు పెట్టుకోవడమే కాదని.. వాటిని కచ్చితంగా చేరుకునేలా ప్రణాళికలు అమలు చేయాలని సీఎం చంద్రబాబు సూచించా రు.

పౌరులు బాధ్యత వహిస్తేనే కల సాకారం: చంద్రబాబు
అమరావతి, ఫిబ్రవరి 14(ఆంధ్రజ్యోతి): స్వచ్ఛాం ధ్ర లక్ష్యాల సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. లక్ష్యా లు పెట్టుకోవడమే కాదని.. వాటిని కచ్చితంగా చేరుకునేలా ప్రణాళికలు అమలు చేయాలని సూచించా రు. రాష్ట్రంలో పరిశుభ్రతను పెంచేందుకు.. అమలు చేస్తున్న కార్యాచరణపై సచివాలయంలో సమీక్ష చేశా రు. ప్రతి నెలా మూడో శనివారం స్వర్ణాంధ్ర-స్వచ్ఛాం ధ్ర కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిర్వహిస్తోంది. ప్రతి నెలా ఒక థీమ్ తీసుకుని ప్రజల్లో అవగాహన కల్పించేందుకు స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. జనవరిలో న్యూ ఇయర్ క్లీన్ స్టార్ట్ అనే అంశాన్ని థీమ్‌గా తీసుకున్నారు. మన మూలాలు-మన బలాలు తెలుసుకునేలా, రాష్ట్రంలోని వనరులను ఎలా సద్వినియోగం చేసుకు ని అభివృద్ధి సాధించాలనే దానిపై దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. జీవన ప్రమాణాలు పెంచడం, పర్యాటక రంగానికి ప్రోత్సాహం, పెట్టుబడులు ఆకట్టుకోవడం, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను చేరుకోవడం, నెట్ జీరోకు రాష్ట్రంలో పర్యావరణాన్ని తీసుకురావడం లక్ష్యంగా పెట్టుకుని పనిచేయాలని సీఎం సూచించా రు. స్వచ్ఛాంధ్ర అంటే స్వచ్ఛమైన మనసులు, స్వచ్ఛమైన పరిసరాలు, స్వచ్ఛమైన ఇళ్లు, కాలనీలు, ఊళ్లు అని అంతా గుర్తించాలన్నారు. ఇళ్లతో పాటు బహిరం గ ప్రదేశాలను, స్కూళ్లు, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రార్థనా మందిరాలు, పరిశ్రమలు కూడా పరిశుభ్రంగా ఉంచాల్సిన అవసరం ఉందన్నారు. ఇది ఏ ఒక్క శాఖకో.. ఒక అధికారికో సంబంధించిన కార్యక్రమంగా చూడవద్దని, పరిశుభ్రత, పచ్చదనం పెంపు, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాల్లో పాఠశాల విద్యార్థి నుంచి నాయకుల వరకు బాధ్యత తీసుకోవాలని సీఎం పిలుపునిచ్చారు. రోడ్లపై చెత్త వేసి, చెట్లు నరికేసి.. అంతా క్లీన్‌గా ఉండాలి, పచ్చదనం ఉండాలి అని నినాదాలిస్తే కుదరదన్నారు.
జిల్లాలకు ర్యాంకులు
స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్రలో భాగంగా మొత్తం 14 ఇండికేటర్స్‌లో పెట్టుకున్న లక్ష్యాలను ముఖ్యమం త్రికి అధికారులు వివరించారు. వీటిఆధారంగా జిల్లాలకు ర్యాంకులు ఇచ్చారు. మొత్తం 200 పా యింట్లకు గాను 129 పాయింట్లతో ఎన్టీఆర్ జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. 127 పాయింట్లతో విశాఖ 2, 125తో తూర్పుగోదావరి 3, 122తో అనంతపురం జిల్లా 4, 120 పాయింట్లతో అన్నమయ్య 5, శ్రీకాకుళం 6. 118 పాయింట్లతో కడప 7వ స్థానం, 117 పాయింట్లతో గుంటూరు 8వ స్థానం, 115 పాయింట్లతో నెల్లూరు 10వ స్థానం ఇలా 26వ ర్యాంక్ వరకు ప్రకటించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
CRDA: రాజధాని అమరావతికి బ్రాండ్ అంబాసిడర్లు
Srinivas Verma: స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి