Share News

CM Chandrababu : ఆర్‌ఐడీఎఫ్‌ పనులు సత్వరమే పూర్తి చేయండి

ABN , Publish Date - Jan 29 , 2025 | 05:27 AM

ఉండవల్లి నివాసంలో మంగళవారం జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఆర్‌ఐడీఎస్‌ నిధులతో ఐదు పనులు చేపట్టాల్సి ఉందని...

CM Chandrababu : ఆర్‌ఐడీఎఫ్‌ పనులు సత్వరమే పూర్తి చేయండి

  • జల వనరుల శాఖకు సీఎం చంద్రబాబు ఆదేశం

అమరావతి, జనవరి 28(ఆంధ్రజ్యోతి): రూరల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవల్‌పఫండ్‌ (ఆర్‌ఐడీఎఫ్‌)తో జల వనరులశాఖలో చేపట్టే పనులను త్వరితగతిన పూర్తి చేపట్టాలని ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్‌ను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఉండవల్లి నివాసంలో మంగళవారం జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఆర్‌ఐడీఎస్‌ నిధులతో ఐదు పనులు చేపట్టాల్సి ఉందని అధికారులు ఆయనకు వివరించారు. ఆర్‌ఐడీఎఫ్‌ ఇచ్చే రూ.999 కోట్లలో గోదావరి డెల్టా సిస్టమ్‌ ఆధునీకరణకు రూ.449.91 కోట్లు, కృష్ణా డెల్టా ఆధునికీకరణకు రూ.250 కోట్లు, పెన్నా డెల్టాను రూ.100 కోట్లతో ఆధునికీకరించాల్సి ఉందని అధికారులు తెలిపారు. రూ.100 కోట్లతో చెరువుల అభివృద్ధి, ఎత్తిపోతల పథకాల పనులను రూ.100 కోట్లతో చేపట్టాల్సి ఉందన్నారు.


For AndhraPradesh News And Telugu News

Updated Date - Jan 29 , 2025 | 05:27 AM