Share News

Mahanadu: ప్రపంచమే ఆశ్చర్యపోవాలి.. ప్రజలకు సీఎం చంద్రబాబు కీలక పిలుపు

ABN , Publish Date - May 28 , 2025 | 04:09 PM

ఆరోగ్యకరమైన జీవనానికి యోగా చాలా మంచిదని మహానాడులో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎప్పుడైనా అలసట వస్తే ఐదు నిమిషాలు కళ్ళు మూసుకుని మెడిటేషన్ చేస్తే గొప్ప రిలీఫ్ వస్తుందన్నారు.

Mahanadu: ప్రపంచమే ఆశ్చర్యపోవాలి.. ప్రజలకు సీఎం చంద్రబాబు కీలక పిలుపు
CM Chandrababu

అమరావతి: రోజు అరగంట ప్రాణాయామం చేస్తే రక్త ప్రసరణ బాగుంటుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మహానాడులో కీలక వ్యాఖ్యలు చేశారు. ఎప్పుడైనా అలసట వస్తే ఐదు నిమిషాలు కళ్ళు మూసుకుని మెడిటేషన్ చేస్తే గొప్ప రిలీఫ్ వస్తుందని అన్నారు. ఆరోగ్య కరమైన జీవనానికి యోగా చాలా మంచిదన్నారు. మన ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచానికి యోగాను పరిచయం చేశారని, విదేశాల్లో కూడా యోగా వారి జీవనంలో భాగం అయిందని కీలక వ్యాఖ్యలు చేశారు.


కోట్ల మంది యోగా చేయాలి

రాబోయే మహానాడుకు అందరు యోగా చేయాలని, యోగా నేర్చుకొని జూన్ 21న విశాఖ రావాలని సూచించారు. కార్యకర్తల కంటే వేదికపై ఉన్న నేతలకు యోగ చాలా అవసరమన్నారు. ఎందుకంటే వీరికి ఫోకస్ వేరే అంశాలపై ఉంటుందన్నారు. రాష్ట్రంలో ఒకే రోజు 2 కోట్ల మంది యోగా చేయాలని పిలుపునిచ్చారు. విశాఖ RK బీచ్ లో ఒకే ప్లేస్‌లో 5 లక్షల మంది యోగ చేస్తున్నారని తెలిపారు.

ప్రపంచమంతా ఆశ్చర్య పోయేలా

విద్యాసంస్థల్లో కూడా ఒక గంట యోగా ప్రాక్టీస్ చేసే విధంగా ప్రణాళిక రూపొందిస్తున్నామని చెప్పారు. యోగాలో ట్రైనర్లు, మాస్టర్ ట్రైనర్లను సిద్ధం చేస్తున్నామన్నారు. యోగాంధ్రకు సిద్ధంగా ఉన్నారా.. అంటూ చంద్రబాబు ప్రశ్నించారు. జూన్ 21న జరిగే యోగా ప్రపంచమంతా ఆశ్చర్య పోయేలా జరగాలని ఆయన పేర్కొన్నారు.


Also Read:

రాజ్యసభ సభ్యుడిగా సత్యనారాయణ ప్రమాణ స్వీకారం

ముందే వచ్చేసిన సజ్జల భార్గవ్ రెడ్డి

For More Telugu News

Updated Date - May 28 , 2025 | 04:11 PM