CID: సేకరించిన సాక్ష్యాధారాలు నేర నిరూపణకు సరిపోవు
ABN , Publish Date - Feb 21 , 2025 | 05:25 AM
ఈ నేపథ్యంలో ‘మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్(వాస్తవాలు గ్రహించడంలో పొరపడడం)’ కింద కేసు మూసివేసి సంబంధిత కోర్టులో తుది నివేదిక దాఖలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని దర్యాప్తు అధికారి సీఐడీ అదనపు డీజీని కోరారు.
సీఏ శ్రవణ్‌కుమార్ విషయంలో ఉల్లంఘనలకు పాల్పడలేదు
హెబియస్ కార్పస్‌ను కొట్టివేయండి... హైకోర్టులో సీఐడీ కౌంటర్
అమరావతి, ఫిబ్రవరి 20(ఆంధ్రజ్యోతి): మార్గదర్శి చిట్స్‌పై నమోదు చేసిన కేసులో సేకరించిన సాక్ష్యాధారాలు నేరనిరూపణకు సరిపోవని సీఐడీ ఓ నిర్ణయానికి వచ్చింది. ఈ నేపథ్యంలో ‘మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్(వాస్తవాలు గ్రహించడంలో పొరపడడం)’ కింద కేసు మూసివేసి సంబంధిత కోర్టులో తుది నివేదిక దాఖలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని దర్యాప్తు అధికారి సీఐడీ అదనపు డీజీని కోరారు. మార్గదర్శి చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కేసులో చార్టర్డ్ అకౌంటెంట్(సీఏ) కుదరవల్లి శ్రవణ్‌కుమార్ అరెస్టుకు సంబంధించి 2023లో దాఖలైన హెబియస్ కార్పస్ పిటిషన్‌లో విజయవాడ సీఐడీ ప్రాంతీయ కార్యాలయం అదనపు ఎస్పీ డి.ప్రసాద్ తాజాగా వేసిన కౌంటర్‌లో ఈ అంశాలు తెలియజేశారు. ‘దర్యాప్తులో భాగంగా సేకరించిన సాక్ష్యాధారాలు నేరనిరూపణకు సరిపోవని, ఈ నేపథ్యంలో నో ఎవిడెన్స్ కింద సంబంధిత కోర్టులో ఫైనల్ రిపోర్ట్ వేసేందుకు తగిన సూచనలు ఇవ్వాలని పూర్వ దర్యాప్తు అధికారి(ఐవో), అదనపు ఎస్పీ రాజశేఖరరావు.. సీఐడీ ఏడీజీకి లేఖ రాశారు. ఈ విషయంలో న్యాయసలహా తీసుకున్న ఏడీజీ.. ‘మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్’ కింద కేసు మూసివేతకు అనుమతిచ్చారు. పూర్వ ఐవో బదిలీ అయ్యాక విజయవాడ సీఐడీ ప్రాంతీయ కార్యాలయం డీఎస్పీ జి.శ్రీనివాస్ కేసు దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా డాక్యుమెంట్ల రూపంలో సేకరించిన సాక్ష్యాలు, మౌఖిక సాక్ష్యాలు నేర నిరూపణకు సరిపోవని భావించారు.
ప్రస్తుత కేసును ‘మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్’గా పరిగణించి సంబంధిత కోర్టుకు నివేదించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఫైనల్ రిపోర్ట్‌ను మంగళగిరి సీఐడీ ఏడీజీ కార్యాలయానికి పంపారు. కేసులో నిందితులుగా ఉన్న ఎంసీఎ్‌ఫపీఎల్ చైర్మన్, ఎండీలకు మాత్రమే అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. సీఏ శ్రవణ్‌కుమార్ విషయంలో పోలీసులు ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడలేదు. ఈ నేపథ్యంలో ఆయన సతీమణి నర్మద దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేయండి’ అని కోరారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో విజయవాడ జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఆఫ్ చిట్స్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న వీఎ్‌సఎ్‌సవీ కృష్ణారావు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మార్గదర్శి చైర్మన్, ఎండీ, ఫోర్‌మెన్, ఆడిటర్ మరికొందరిపై సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో చార్టర్డ్ అకౌంటెంట్ శ్రవణ్‌కుమార్‌ను సీఐడీ అధికారులు 2023లో అరెస్టు చేశారు. విజయవాడ మూడో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఆయనకు జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. తన భర్తకు రిమాండ్ విధించే అధికారం విజయవాడ మూడో ఏసీఎంఎంకు లేదంటూ ఆయన సతీమణి కె.నర్మద హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు.
ఇవి కూడా చదవండి:
Paper Leak: టెన్త్ క్లాస్ పేపర్ లీక్.. హిందీ, సైన్స్ పరీక్షలు రద్దు
Atishi: వచ్చి రాగానే కొత్త ప్రభుత్వంపై ఆప్ ఒత్తిడి.. ఢిల్లీ మహిళలు వేచి చూస్తున్నారని..
Google Pay: గూగుల్ పేలో కూడా బాదుడు మొదలు.. ఈ చెల్లింపులకు
Stock Markets: ఈరోజు కూడా నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. టాప్ 5 లాసింగ్ స్టాక్స్
Recharge Offer: నెలకు రూ. 99కే రీఛార్జ్ ప్లాన్.. జియో, ఎయిర్‌టెల్‌కు గట్టి సవాల్
Read More Business News and Latest Telugu News