Share News

CID :ఉర్దూ అకాడమీ నిధుల గోల్‌మాల్‌ కేసులో ఇద్దరి అరెస్టు

ABN , Publish Date - Feb 25 , 2025 | 06:40 AM

ఉర్దూ అకాడమీలో నిధుల గోల్‌మాల్‌కు సంబంధించిన కేసులో ఇద్దరు నిందితులను సీఐడీ అధికారులు అరెస్టు చేశారు.

CID :ఉర్దూ అకాడమీ నిధుల గోల్‌మాల్‌ కేసులో ఇద్దరి అరెస్టు

అమరావతి, ఫిబ్రవరి 24(ఆంధ్రజ్యోతి): ఉర్దూ అకాడమీలో నిధుల గోల్‌మాల్‌కు సంబంధించిన కేసులో ఇద్దరు నిందితులను సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. ఉర్దూ అకాడమీ మాజీ డైరెక్టర్‌ మస్తాన్‌ వలీ(రిటైర్డ్‌)తోపాటు ప్రస్తుతం తెలంగాణలో సూపరింటెండెంట్‌గా పనిచేస్తోన్న జాఫర్‌ రూ.3.92 కోట్ల మేర అక్రమాలకు పాల్పడినట్లు గతంలో సీఐడీ కేసు నమోదు చేసింది. ఆ సొమ్ము సుమారు 67మంది ఖాతాల్లోకి వెళ్లినట్లు దర్యాప్తులో తేలడంతో జాఫర్‌ బంధువులైన సహిదుల్లా బేగ్‌, ఖలీల్‌ బేగ్‌లను గుంటూరులో సీఐడీ అధికారులు అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. న్యాయస్థానం రిమాండ్‌ విధించడంతో వారిని నెల్లూరు సెంట్రల్‌ జైలుకు తరలించినట్టు సీఐడీ అధికారులు తెలిపారు.

Updated Date - Feb 25 , 2025 | 06:40 AM