Share News

Janasena: జనసేనలో విచిత్ర పరిస్థితి

ABN , Publish Date - Dec 12 , 2025 | 12:04 AM

తిరుపతి జనసేన పార్టీలో విచిత్ర పరిస్థితి కనిపిస్తోంది. తమ అఽధినాయకుడిని అవమానించినవారిపై చర్యలు తీసుకోవాలని ఒక వర్గం ఫిర్యాదు చేస్తే, లైట్‌ తీసుకోమని మరో వర్గం పోలీసులపై ఒత్తిడి తెస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.

Janasena: జనసేనలో విచిత్ర పరిస్థితి

తిరుపతి, డిసెంబరు 11 (ఆంరఽధజ్యోతి): తిరుపతి జనసేన పార్టీలో విచిత్ర పరిస్థితి కనిపిస్తోంది. తమ అఽధినాయకుడిని అవమానించినవారిపై చర్యలు తీసుకోవాలని ఒక వర్గం ఫిర్యాదు చేస్తే, లైట్‌ తీసుకోమని మరో వర్గం పోలీసులపై ఒత్తిడి తెస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. వైసీపీ అధినేత జగన్మోహన్‌ రెడ్డి కాళ్లను డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ పట్టుకున్నట్టు, ఆయన ఆశీస్సులు అందిస్తున్నట్టు మార్ఫింగ్‌ ఫొటోలను వైసీపీ సోషల్‌ మీడియా వైరల్‌ చేసింది. దీనిపై కిరణ్‌ రాయల్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈనెల 9న ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. విజయ్‌ లక్కీ, వైఎ్‌సఆర్‌సీపీ ఏలూరు, వైఎ్‌సఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తిరుపతి పేర్లతో ఉన్న ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రాం ఐడీలను ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. సోషల్‌ మీడియా గ్రూపులకు అడ్మిన్లు, ప్రమోటర్స్‌గా వ్యవహరిస్తున్న వైసీపీ నేతలు పసుపులేటి సురేష్‌, శ్రావణ్‌ పేర్లను కూడా ఫిర్యాదులో కిరణ్‌ ప్రస్తావించారు. తమ మనోభావాలు దెబ్బతీసేలా డిప్యూటీ సీఎంపై అనుచిత పోస్టులు పెట్టినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. పోలీస్‌ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సీఐ శ్రీనివాసులు అదేరోజు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఈ ఫిర్యాదులో పేర్కొన్న వైసీపీ నేతలు రెండు రోజులుగా టీవీ డిబేట్లలోనూ, సోషల్‌ మీడియాలోనూ కూటమినేతలపై ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. కనీసం వీరిని పోలీసులు విచారించడం లేదని జనసేనలోని ఒక వర్గం ఆవేదన వ్యక్తంచేస్తోంది. మరోవైపు ఆ ఫిర్యాదును పట్టించుకోవద్దని జనసేన పార్టీలోని ఇంకో వర్గం పోలీసులపై ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం.

Updated Date - Dec 12 , 2025 | 12:04 AM