Share News

SKOCH Award: స్వర్ణనారావారిపల్లె ప్రాజెక్టుకు స్కోచ్‌ పురస్కారం

ABN , Publish Date - Sep 21 , 2025 | 01:32 AM

స్వర్ణనారా వారిపల్లి ప్రాజెక్టులో భాగంగా 45 రోజుల్లో 1,600 ఇళ్లకు సోలార్‌ రూఫ్‌టాప్‌ ఏర్పాటు చేసినందుకు అత్యంత ప్రతిష్టాత్మకమైన స్కోచ్‌ పురస్కారం లభించింది.

SKOCH Award: స్వర్ణనారావారిపల్లె ప్రాజెక్టుకు స్కోచ్‌ పురస్కారం
అవార్డు అందుకుంటున్న కలెక్టర్‌ వెంకటేశ్వర్‌

తిరుపతి(కలెక్టరేట్‌),సెప్టెంబరు20 (ఆంధ్రజ్యోతి): స్వర్ణనారా వారిపల్లి ప్రాజెక్టులో భాగంగా 45 రోజుల్లో 1,600 ఇళ్లకు సోలార్‌ రూఫ్‌టాప్‌ ఏర్పాటు చేసినందుకు అత్యంత ప్రతిష్టాత్మకమైన స్కోచ్‌ పురస్కారం లభించింది. ఢిల్లీలోని ఇండియా హాబిటాట్‌ కన్వెన్షన్‌లో శనివారం ఈ అవార్డును ఏపీఎస్పీడీసీఎల్‌ సీఈ సురేంద్రనాయుడితో కలిసి కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ అందుకున్నారు. గ్రామాల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో రూ.20.68కోట్లతో ఎ.రంగంపేట, కందులవారిపల్లి, చిన్నరామాపురం గ్రామ పంచాయతీల్లోని 1,600 గృహాలకు సోలార్‌ రూఫ్‌టాప్‌ ఏర్పాటు చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌, జిల్లా యంత్రాంగం సహకారంతోనే ఇది సాధ్యమైందని కలెక్టర్‌ ఈ సందర్భంగా పేర్కొన్నారు. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, జేసీ శుభం బన్సల్‌, స్వర్ణనారావారిపల్లి స్పెషల్‌ ఆఫీసర్‌ సుశీలాదేవి, ఇతర అధికారులు కలెక్టర్‌కు అభినందలు తెలిపారు.

Updated Date - Sep 21 , 2025 | 01:32 AM