Share News

Polyhos: ఎస్‌ఆర్‌పురంలో పాలీహోస్‌ !

ABN , Publish Date - Sep 21 , 2025 | 01:36 AM

ఆటో మొబైల్‌ ఇండస్ర్టీకి అవసరమైన థర్మోప్లాస్టిక్‌,స్టీల్‌ గొట్టాల తయా రీలో పేరెన్నిక గన్న పాలీహోస్‌ కంపెనీ ఎస్‌ఆర్‌పురం మండలంలో రూ.500కోట్ల పెట్టుబడితో భారీ యూనిట్‌ ఏర్పాటుకు ముందుకొచ్చింది.

Polyhos: ఎస్‌ఆర్‌పురంలో పాలీహోస్‌ !
శ్రీరంగరాజపురంలో గురువారం భూసేకరణఫై అధికారులతో చర్చిస్తున్న కలెక్టర్‌

చిత్తూరు, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): ఆటో మొబైల్‌ ఇండస్ర్టీకి అవసరమైన థర్మోప్లాస్టిక్‌,స్టీల్‌ గొట్టాల తయా రీలో పేరెన్నిక గన్న పాలీహోస్‌ కంపెనీ ఎస్‌ఆర్‌పురం మండలంలో రూ.500కోట్ల పెట్టుబడితో భారీ యూనిట్‌ ఏర్పాటుకు ముందుకొచ్చింది. ఇందుకుఅవసరమైన భూమి ని సేకరించేందుకు అధికార యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది.గంగాధర నెల్లూరు నియోజకవర్గానికి పెద్దఎత్తున పరిశ్రమలు తీసుకొచ్చి ఉపాధి కల్పిస్తానని ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలు చేసేందుకు ఎమ్మెల్యే థామస్‌ కృషి చేస్తున్నారు. ఈ ఏడాది జూన్‌ నుంచి పాలిహోస్‌ యాజమాన్యంతో చర్చలు జరిపి నియోజకవర్గానికి వచ్చేందుకు ఒప్పించారు.అయితే ఇండస్ర్టీ ఏర్పా టు చేసేందుకు చిత్తూరు- తచ్చూరు ఎక్స్‌ప్రెస్‌ వే సమీపంలో 500 ఎకరాలు కావాలని అడిగారు. ఎస్‌ఆర్‌పురం మండలంలోని 56.కన్నికాపురం, పాతపాళ్యం, జీఎంఆర్‌పురం రెవెన్యూ గ్రామాల పరిధిలో 500 ఎకరాల్ని కేటాయించేందుకు ఎమ్మెల్యే థామస్‌ ప్రయత్నిస్తున్నారు.ఇటీవల కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ కూడా ఎస్‌ఆర్‌పురం మండలంలో పర్యటించి, కేటాయించనున్న భూమిని పరిశీలించారు. ప్రస్తుతానికి సుమారు 250- 300 ఎకరాలు కేటాయించేందుకు కలెక్టర్‌ అంగీకరించినట్లు తెలుస్తోంది. ఈ భూమిలో సుమారు 50-60 మంది రైతులుండడంతో, వారిని భూసేకరణకు ఒప్పించాల్సివుంది.తొలి విడతలో రూ.500 కోట్లతో ఇండస్ర్టీని ఏర్పాటు చేసి, విడతల వారీగా మరో రూ.వెయ్యి కోట్ల వరకు పెట్టుబడి పెట్టేందుకు పాలిహోస్‌ కంపెనీ సిద్ధమైనట్లు ఎమ్మెల్యే థామస్‌ తెలిపారు. ఇక్కడ ఇండస్ర్టీ ప్రారంభమైతే సుమారు 2 వేల మందికి ఉపాధి లభించనుందని వివరించారు.


పాలీహో్‌సతో పాటు మరిన్ని పరిశ్రమలు: థామస్‌, జీడీనెల్లూరు ఎమ్మెల్యే

గంగాధర నెల్లూరు నియోజకవర్గాన్ని ఇండస్ర్టియల్‌ హబ్‌గా మార్చి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే ప్రధాన లక్ష్యంగా రాజకీయాల్లోకి వచ్చా. ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వెళుతున్న యువతకు ఇక్కడే ఉపాధి కల్పించేలా కృషి చేస్తున్నా.పాలీహోస్‌ రావడంతో తొలి అడుగు పడింది. జీడీనెల్లూరులో బయో సీఎన్‌జీ ప్లాంటు, కార్వేటినగరంలో క్లాసిక్‌ టూల్స్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ యూనిట్‌తో పాటు ఐటీ కంపెనీ ఏర్పాటుకు సన్నాహాలు ప్రారంభించాం.ఈ రెండింటికీ భూమి కూడా గుర్తించాం. భారత్‌ బయోటెక్‌ కంపెనీతో సంప్రదింపులు చేస్తున్నాం.

300 ఎకరాల భూసేకరణకు ప్రయత్నం: సుమిత్‌కుమార్‌, కలెక్టర్‌

తమిళనాడులో పాలీహోస్‌ ఇండస్ర్టీకి పెద్ద యూనిట్లు ఉన్నాయి. వేలకోట్ల రూపాయల టర్నోవర్‌ ఉంది. అలాంటి కంపెనీ జీడీనెల్లూరు యూనిట్‌ ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. 500 ఎకరాలు కావాలని అడిగారు. 250-300 ఎకరాలు ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. రైతులతో మాట్లాడి ఒప్పించి భూసేకరణ చేయనున్నాం.

Updated Date - Sep 21 , 2025 | 01:36 AM