Share News

జగన్‌ పర్యటన.. తీరు మారేలా లేదే..!

ABN , Publish Date - Jul 09 , 2025 | 01:17 AM

వైఎస్‌ జగన్‌ పర్యటనలో సొంత పార్టీ కార్యకర్తల ప్రాణాలు పోతున్నా, పోలీసులకు గాయాలవుతున్నా, సామాన్యులు ఇబ్బందులు పడుతున్నా వైసీపీ నేతలు పట్టించుకోవడం లేదు. జగన్‌ ఎదుట బలాన్ని నిరూపించుకోవడానికి జిల్లా నేతలు తాపత్రయపడుతున్నారు. ఓవైపు పోలీసులు 500 మందికి మించకుండా ఉండాలని సూచనలు చేస్తున్నప్పటికీ వాటినేమి పట్టించుకోని వైసీపీ నేతలు జనాలను తరలించడానికి ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.

జగన్‌ పర్యటన.. తీరు మారేలా లేదే..!
YS Jagan Mohan Reddy Tour

అనుమతుల్లేకపోయినా బలప్రదర్శనకు సిద్ధమవుతున్న వైసీపీ

పోలీసుల అనుమతి 500 మంది.. వైసీపీ టార్గెట్‌ 30 వేలు..

ఇప్పటికే బంగారుపాళ్యంలో 600 మంది పోలీసులు, అన్ని మార్గాల్లో చెక్‌పోస్టులు

మాట వినకుంటే అత్యంత కఠినంగా వ్యవహరించేందుకు సిద్ధం

చిత్తూరు అర్బన్‌, జులై 8 (ఆంధ్రజ్యోతి): వైఎస్‌ జగన్‌ పర్యటనలో సొంత పార్టీ కార్యకర్తల ప్రాణాలు పోతున్నా, పోలీసులకు గాయాలవుతున్నా, సామాన్యులు ఇబ్బందులు పడుతున్నా వైసీపీ నేతలు పట్టించుకోవడం లేదు. జగన్‌ ఎదుట బలాన్ని నిరూపించుకోవడానికి జిల్లా నేతలు తాపత్రయపడుతున్నారు. ఓవైపు పోలీసులు 500 మందికి మించకుండా ఉండాలని సూచనలు చేస్తున్నప్పటికీ వాటినేమి పట్టించుకోని వైసీపీ నేతలు జనాలను తరలించడానికి ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో జరిగిన సంఘటనలన్నీ గమనించి పోలీసుశాఖ అప్రమత్తమైంది. బుధవారం బంగారుపాళ్యం మార్కెట్‌యార్డులో మామిడి రైతులతో మాట్లాడతారని ఆ పార్టీ నేతలు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడ బహిరంగ సభ, సమావేశం లేదని.. కేవలం మామిడి రైతులు పడుతున్న ఇబ్బందులను తెలుసుకోవడానికే జగన్‌ వస్తున్న నేపథ్యంలో పెద్దఎత్తున జనాలు రాకూడదని పోలీసులు సూచించారు.


కాగా.. ఇప్పటికే పూతలపట్టు నియోజకవర్గంలోని ఓ మండల స్థాయి నేత జనాన్ని తరలించడానికి తమిళనాడు నుంచి వంద కార్లను రప్పించేందుకు చర్యలు చేపట్టాను. అలాగే నియోజకవర్గంలోని ప్రతి మండలం నుంచి వంద కార్లతో జనాన్ని తీసుకురావాలని పెద్దిరెడ్డి ఆదేశించినట్లు తెలుస్తోంది. అలాగే చిత్తూరు, పుంగనూరు, పలమనేరు, గంగాధరనెల్లూరు, నగరి నియోజకవర్గాల నుంచి పెద్దసంఖ్యలో జనాన్ని తరలిస్తున్నారు. ఈ లెక్కన జిల్లా నుంచి 20వేల నుంచి 25వేల మందివరకు రప్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు సమాచారం. రానున్న రోజుల్లో ఎన్నికలు లేకపోయినా.. అధినేత దృష్టిలో పడాలంటే ఇదే సరైన సమయమని భావించిన నేతలు ఖర్చులకు వెనుకాడకుండా పనులు చేస్తున్నారు. ఇప్పటికే జగన్‌ ప్రయాణించే మార్గంలో పెద్దఎత్తున స్వాగత ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.


జగన్‌ పర్యటన వివరాలు..

మాజీ సీఎం జగన్‌ బుధవారం బంగారుపాళ్యం పర్యటన వివరాలను వైసీపీ నాయకులు విడుదల చేశారు. బుధవారం ఉదయం 9.30 గంటలకు బెంగళూరులోని ఎలహంక నివాసం నుంచి 9.50 గంటలకు జకూర్‌ విమానాశ్రయానికి చేరుకుంటారు. 10 గంటలకు అక్కడినుంచి విమానంలో బయల్దేరి 10.50 గంటలకు బంగారుపాళ్యం మండలం కొత్తపల్లె వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌ వద్దకు చేరుకుంటారు. 11 గంటలకు హెలిప్యాడ్‌ వద్ద నుంచి కారులో మార్కెట్‌యార్డుకు బయల్దేరుతారు. 11.20 గంటలకు మ్యాంగో మార్కెట్‌ వద్దకు చేరుకుంటారు. 11.20 నుంచి 12.20 గంటల వరకు రైతులతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. 12.35 గంటలకు మార్కెట్‌ యార్డు నుంచి కొత్తపల్లె వద్ద హెలిప్యాడ్‌ వద్దకు చేరుకుంటారు. 12.45 గంటలకు హెలిప్యాడ్‌ నుంచి బెంగళూరుకు బయల్దేరుతారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Gold And Silver Rate: పసిడి ప్రియులకు షాక్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు..

Putin US Relations: రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై ట్రంప్ తీవ్ర అసహనం..

Updated Date - Jul 09 , 2025 | 07:58 AM