Gold And Silver Rate: పసిడి ప్రియులకు షాక్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు..
ABN , Publish Date - Jul 09 , 2025 | 06:45 AM
Gold And Silver Rate: నిన్న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 90,600 రూపాయల దగ్గర..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 98,840 రూపాయల దగ్గర.. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర 74,130 రూపాయల దగ్గర ట్రేడ్ అయింది.
బంగారానికి మహిళలకు కొన్ని వేల ఏళ్ల నుంచి అవినాభావ సంబంధం ఉంది. ఆడవాళ్లు తమ దగ్గర ఎంత బంగారం ఉన్నా.. ఇంకా కావాలంటారే తప్ప వద్దు అనరు. శుభకార్యాల్లో బంగారం విషయాలే ప్రధాన టాపిక్ అవుతాయి. భారతీయ సంస్కృతిలో ఓ భాగం అయిన బంగారం ధరలు పేద, మధ్య తరగతి వాళ్లకు షాక్ ఇస్తున్నాయి. రోజు రోజుకు పెరుగుతూ పోతున్నాయి. ప్రస్తుతం 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 99వేల దగ్గర ట్రేడ్ అవుతోంది. రానున్న రోజుల్లో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.
హైదరాబాద్‌లో నేటి బంగారం ధరలు ఇలా..
హైదరాబాద్ మహా నగరంలో నిన్న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 90,600 రూపాయల దగ్గర..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 98,840 రూపాయల దగ్గర.. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర 74,130 రూపాయల దగ్గర ట్రేడ్ అయింది. నిన్నటితో పోల్చుకుంటే పది గ్రాముల బంగారంపై.. గ్రాముకు ఒక రూపాయి చొప్పున 10 రూపాయలు పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 98,850 రూపాయల దగ్గర.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 90,610 రూపాయల దగ్గర.. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర .. 74,140 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది.
ప్రధాన నగరాల్లో బంగారం ధరలు
విజయవాడ 9,513
చెన్నై 9,885
ముంబై 9,885
విశాఖపట్నం 9,885
వెండి ధరలు ఇలా ..
బంగారం ధరలతో సంబంధం లేకుండా వెండి ధరలు ప్రతీ రోజు ఎంతో కొంత తగ్గుతూ వస్తున్నాయి. నిన్న హైదరాబాద్ నగరంలో 100 గ్రాముల వెండి ధర 11,990 దగ్గర ట్రేడ్ అయింది. కేజీ వెండి ధర 1,19,900 దగ్గర ట్రేడ్ అయింది. ఈ రోజు 100 గ్రాముల వెండిపై 10 రూపాయలు, కేజీ వెండిపై 100 రూపాయలు తగ్గింది. 100 గ్రాముల వెండి ధర నేడు 11,980 దగ్గర ట్రేడ్ అవుతోంది. కేజీ వెండి ధర 1,19,800 దగ్గర ట్రేడ్ అవుతోంది.
ఇవి కూడా చదవండి