Share News

Government Office: బకాయిల దెబ్బకు బయటే డ్యూటీ

ABN , Publish Date - Jul 09 , 2025 | 06:40 AM

ఆఫీసుకు వెళితే అక్కడి సిబ్బందికి లోపల కూర్చోబుద్దేయదు.

Government Office: బకాయిల దెబ్బకు బయటే డ్యూటీ

  • రూ.60వేలకు పైగా కార్యాలయ విద్యుత్తు బిల్లు పెండింగ్‌

  • కరెంట్‌ కట్‌.. రెండేళ్లకుపైగా ఆఫీసు ఆవలే సిబ్బంది విధులు

హుస్నాబాద్‌, జూలై 8 (ఆంధ్రజ్యోతి): ఆఫీసుకు వెళితే అక్కడి సిబ్బందికి లోపల కూర్చోబుద్దేయదు. ఒకవేళ బలవంతంగా కూర్చున్నా ఆ చీకట్లో ఫైళ్లు చూడలేని పరిస్థితి. పైగా ఉక్కబోతతో చెమటలు.. దోమల బెడెద! ఇలా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని మండల పరిషత్తు కార్యాలయం పక్కన ఉన్న శ్రీరాంసాగర్‌ వరద కాలువ గౌరవెల్లి ప్రాజెక్టు డివిజన్‌-3 కార్యాలయ ఉద్యోగులకు పెద్ద కష్టమే వచ్చి పడింది. సిబ్బంది అంతా కార్యాలయం బయట కూర్చునే విధులు నిర్వహిస్తున్నారు. కార్యాలయానికి సం బంధించి 60వేల మేర విద్యుత్తు బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో రెండున్నరేళ్ల క్రితమే విద్యుత్తు అధికారులు కరెంట్‌ కనెక్షన్‌ కట్‌ చేశారు. అప్పటి నుంచి.. ఆ కార్యాలయంలో పనిచేస్తున్న నలుగురు డీఈలు సహా 15మంది సిబ్బంది కుర్చీలు, టేబుళ్లు బయటే వేసుకొని పనులు చేసుకుంటున్నారు.

Updated Date - Jul 09 , 2025 | 06:40 AM