Share News

Elephants: వరి, అరటి తోటలపై ఏనుగుల దాడి

ABN , Publish Date - Aug 31 , 2025 | 01:33 AM

పలమనేరు మండలం బయప్పగారిపల్లి పం చాయితీ ఊసరపెంట గ్రామ సమీపంలోని వరి, అరటి తోటలపై ఏనుగులు దాడి చేసి పంటలను ధ్వంసం చేశాయి.

Elephants: వరి, అరటి తోటలపై ఏనుగుల దాడి
నూనేవారిపల్లి సమీపంలో ఏనుగులు తొక్కేసిన వరి పంట

పలమనేరు, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి) : పలమనేరు మండలం బయప్పగారిపల్లి పం చాయితీ ఊసరపెంట గ్రామ సమీపంలోని వరి, అరటి తోటలపై ఏనుగులు దాడి చేసి పంటలను ధ్వంసం చేశాయి. శుక్రవారం రాత్రి బాబునాయుడుకు అర్ధ ఎకరంలో సాగుచేసిన వరి పంటతో పాటు అరటి చెట్లను ఏనుగులు దాడిచేసి తీవ్రంగా నష్టపరిచాయి. మహేశ్వరికి చెందిన ఎకరా వరి పంటను ఏనుగులు తొక్కి నాశనం చేశాయి. అరుణాచలానికి చెందిన కోత దశలో ఉన్న టమోటా పంటపై ఏనుగులు దాడిచేసి ధ్వంసం చేశాయి. తమ పంట పొలాల చుట్టూ సోలార్‌ విద్యుత్‌ కంచె ఏర్పాటు చేసుకొనేందుకు తమకు ఇకనైనా ప్రభుత్వం వంద శాతం సబ్సిడీ ఇవ్వాలని రైతులు కోరుతున్నారు.

Updated Date - Aug 31 , 2025 | 01:33 AM