Share News

RTC: ఈ- బస్సు.. ఏసీ సూపర్‌ లగ్జరీ!

ABN , Publish Date - Oct 31 , 2025 | 01:42 AM

పాత సూపర్‌ లగ్జరీ బస్సులను ఏం చేయాలి? పర్యావరణ హితం.. సంస్థకు లాభదాయకంగా ఎలా మార్చాలి? ‘ఎలక్ట్రిక్‌ ఏసీ సూపర్‌ లగ్జరీలు’గా కన్వర్షన్‌ చేయడమే దీనికి పరిష్కారంగా అధికారులు ఓ నిర్ణయానికొచ్చారు. ఈ ప్రయోగం విజయవంతమైతే తక్కువ ఖర్చుతో ఎలక్ట్రిక్‌ ఏసీ సూపర్‌ లగ్జరీ బస్సులు మరిన్ని రోడ్డెక్కనున్నాయి.

RTC: ఈ- బస్సు.. ఏసీ సూపర్‌ లగ్జరీ!
రెట్రీఫిట్మింట్‌ చేయనున్న సూపర్‌లగ్జరీ బస్సు - నమూనా ‘ఎలక్ట్రిక్‌ ఏసీ సూపర్‌ లగ్జరీ’ బస్సు

తిరుపతి(ఆర్టీసీ), ఆంధ్రజ్యోతి: పాత సూపర్‌ లగ్జరీ బస్సులను ఏం చేయాలి? పర్యావరణ హితం.. సంస్థకు లాభదాయకంగా ఎలా మార్చాలి? ‘ఎలక్ట్రిక్‌ ఏసీ సూపర్‌ లగ్జరీలు’గా కన్వర్షన్‌ చేయడమే దీనికి పరిష్కారంగా అధికారులు ఓ నిర్ణయానికొచ్చారు. ఈ ప్రయోగం విజయవంతమైతే తక్కువ ఖర్చుతో ఎలక్ట్రిక్‌ ఏసీ సూపర్‌ లగ్జరీ బస్సులు మరిన్ని రోడ్డెక్కనున్నాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఆర్టీసీపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. రాష్ట్రవ్యాప్తంగా ఎలక్ర్టిక్‌ బస్సుల ఏర్పాటులో జిల్లాకు తొలి ప్రాధాన్యమిచ్చే కార్యాచరణ వేగవంతమైంది. ఇప్పటికే చిత్తూరులో గ్యాస్‌తో బస్సు నడిచేలా ప్రయోగాత్మకంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అలాగే కుప్పండిపో నుంచి ఓ బస్సును ఎలక్ర్టిక్‌ విధానంలోకి మార్చేందుకు బెంగళూరు సంస్థను సంప్రదించారు. తిరుపతికి సంబంధించి రెట్రీఫిట్మెంట్‌కు పూణెకు చెందిన కల్యాణి పవర్‌ట్రైన్‌ లిమిటెడ్‌ సంస్థ ముందుకు రాగా వారం కిందటే ఎంవోయూ కుదుర్చుకున్నారు. దీంతో పాటు ఆర్టీవో ద్వారా కన్వెన్షన్‌ అనుమతి పొందారు. దీనికోసం ప్రస్తుతం పల్లెవెలుగు పేరుతో నడుస్తున్న సూపర్‌లగ్జరీ అశోక్‌ లేల్యాండ్‌ బస్సు (ఏపీ 03 జెడ్‌ 5473)ను ఎంపిక చేశారు. దీనిని అతి త్వరలోనే విజయవాడలోని కల్యాణి పవర్‌ట్రైన్‌ లిమిటెడ్‌ యూనిట్‌కు తీసుకెళ్లి అప్పగిస్తారు. ఆ తర్వాత 180రోజుల్లో ఫిట్మెంట్‌, బాడీఫ్యాబ్రికేషన్‌, టెస్టుట్రయల్‌ నిర్వహిస్తారు. ఈ టెస్ట్‌రన్‌ రిపోర్టుతో పూణెలోని ఆ సంస్థ ఆమోదం పొందుతారు. ఆపై 60 రోజులపాటు విజయవాడ లేదా తిరుపతిలో క్షేత్రస్థాయిలో టెస్ట్‌రన్‌ చేస్తారు. అది విజయవంతమైతే ఆర్టీవో ద్వారా రిజిస్ర్టేషన్‌ ప్రక్రియ పూర్తిచేసి డీజిల్‌ ఎల్లో బోర్డు నుంచి గ్రీన్‌ బోర్డుకు మారుస్తారు. ఆ తర్వాత ప్రయాణికుల ఆదరణ ఉన్న రెగ్యులర్‌ రూట్‌ను ఎంపికచేసి కొన్ని రోజుల పాటు నడపతారు. ఆ తర్వాత దీనిపై ఉన్నతాధికారులు సమీక్షించి ఇలా మార్చడంతో ప్రయోజనం ఉందనుకుంటే మిగతా పాత సూపర్‌ లగ్జరీ బస్సులను ఇదే ప్రక్రియలోకి తీసుకురానున్నారు.


మార్పులు.. చేర్పులిలా

ఫ పాత బస్సులో ప్రస్తుతమున్న ఇంజన్‌, గేర్‌బాక్సు, రేడియేటర్‌, ఎగ్జాస్టర్‌సిస్టమ్‌, డీజల్‌ ట్యాంకు తొలగిస్తారు. వాటి స్థానంలో బ్యాటరీలు, హెవీడ్యూటీ హేర్‌ కంప్రెషర్‌, బ్యాటరీ కూలింగ్‌ సిస్టమ్‌, పవర్‌ కన్వర్టర్లను అమరుస్తారు. చేసెస్‌ మినహా మిగిలిన అన్ని భాగాలు మారుస్తారు. ఫ36సీట్ల సామర్థ్యంతో ఎలక్ట్రిక్‌ ఏసీ సూపర్‌ లగ్జరీ బస్సుగా మారుస్తారు. ఫ రూ.100 ఇంధనంతో ఐదు కిలోమీటర్లు నడిచే బస్సు.. రెట్రీఫిట్మెంట్‌ ద్వారా రూ.50 విద్యుత్‌, ఇతర ఖర్చులతో ఐదు కిలోమీటర్లకుపైగా నడుస్తుంది.ఫఆర్టీసీకి సగం ఖర్చుల భారం తగ్గుతుంది. ఫఎలక్ట్రిక్‌ బస్సు కావడం వల్ల కాలుష్యం, శబ్దం లేకుండా పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుంది. ఫబ్యాటరీ చార్జింగ్‌ పూర్తయితే 140 నుంచి 150 కిలోమీటర్లు ఏసీతో ప్రయాణిస్తుంది.

Updated Date - Oct 31 , 2025 | 01:42 AM