BREAKING: వైఎస్ జగన్ మేనమామపై కేసు నమోదు!
ABN , Publish Date - Aug 11 , 2025 | 04:35 PM
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌కు మరో షాక్ తగిలింది. ఆయన మేనమామపై పోలీసులు కేసు నమోదు చేశారు.
తిరుమల, ఆగస్ట్ 11: వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌కు మరో షాక్ తగిలింది. ఆయన మేనమామపై పోలీసులు కేసు నమోదు చేశారు. తిరుమలలో టీటీడీ నిబంధనలను ఉల్లంఘించి జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి రాజకీయ ప్రసంగం చేశారు. టీటీడీ విజిలేన్స్ ఫిర్యాదు మేరకు వన్ టౌన్ పోలీసులు Cr. No. 47/2025 U/sec 223 BNS Act కింద కేసు నమోదు చేశారు.
ఇంతకీ ఏం జరిగిందంటే..
తిరుమల శ్రీవారిని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి ఆదివారం దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల పలు రాజకీయ ఆరోపణలు చేశారు. ఆయన చేసిన రాజకీయ ఆరోపణల వీడియోలు.. మీడియా, సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో తిరుమలలో ఆయన ఇలా చేయడం ఏమిటంటూ రవీంద్రనాథ్ రెడ్డి వ్యవహార శైలిని పలువురు ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ వెల్లువెత్తుతోంది. అదీకాక రవీంద్రనాథ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను టీటీడీ విజిలెన్స్ విభాగం అధికారులు పరిశీలించారు. అనంతరం టీటీడీ విజిలెన్స్ ఫిర్యాదు మేరకు తిరుమల వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.
తిరుమల అంటేనే పవిత్రమైన ఆధ్యాత్మిక క్షేత్రం. ఈ క్షేత్రంలో.. అది కూడా ఆ దేవదేవుడు శ్రీవేంకటేశ్వర స్వామి వారు కొలువైన ఆనంద నిలయం వెలుపల రాజకీయాలు, రీల్స్ వంటివి చేయవద్దంటూ తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఇప్పటికే కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు అతిక్రమిస్తే చర్యలు తప్పవంటూ టీటీడీ క్లియర్‌కట్‌గా హెచ్చరించిన సంగతి తెలిసిందే.
పార్టీ విలీనంపై కేసీఆర్ అత్యవసర సమావేశం..!
For More AndhraPradesh News And Telugu News