POCSO case: పోక్సోకేసులో 20 ఏళ్ల జైలు, జరిమానా
ABN , Publish Date - Oct 31 , 2025 | 01:31 AM
పోక్సో కేసులో అన్నమయ్య జిల్లా యువకుడికి 20 ఏళ్ల జైలు శిక్ష, విధిస్తూ చిత్తూరు న్యాయస్థానం తీర్పు చెప్పింది.
చిత్తూరు లీగల్, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): పోక్సో కేసులో అన్నమయ్య జిల్లా యువకుడికి 20 ఏళ్ల జైలు శిక్ష, విధిస్తూ చిత్తూరు న్యాయస్థానం తీర్పు చెప్పింది. పీటీఎం మండలం మద్దయ్యగారిపల్లెకు చెందిన నరేంద్రరెడ్డి ఓ బాలికను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు.బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో పీటీఎం పోలీసులు 2023 నవంబరు 29న కేసు నమోదు చేసి నరేంద్రరెడ్డిని రిమాండ్‌కు తరలించారు. ఈ కేసు గురువారం చిత్తూరు కోర్టు ఆవరణలో ఉన్న పోక్సో కోర్టులో విచారణకు వచ్చింది. నేరం రుజువుకావడంతో పూర్వపరాలు పరిశీలించిన న్యాయమూర్తి శంకర్‌రావు ముద్దాయి నరేంద్రరెడ్డికి 20 ఏళ్ల జైలుశిక్ష, రూ. 10వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. అలాగే బాధితురాలికి రూ. లక్ష నష్టపరిహారాన్ని చెల్లించాలని అన్నమయ్య జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. ఈ కేసును స్పెషల్ పీపీ మోహన కుమారి వాదించారు.