Share News

Kamma Seva Samakhya: సేవా కార్యక్రమాలు విస్తృతం చేయాలి

ABN , Publish Date - Jul 14 , 2025 | 03:01 AM

కమ్మ సేవా సమాఖ్య ఆధ్వర్యంలో సామాజిక సేవా కార్యక్రమాలు విస్తృతం చేసేందుకు కమ్మ సామాజిక మేధావులు...

Kamma Seva Samakhya: సేవా కార్యక్రమాలు విస్తృతం చేయాలి

  • కమ్మ సేవాసమితి రాష్ట్ర అధ్యక్షుడు మండవ మురళీకృష్ణ

విజయవాడ, జూలై 13 (ఆంధ్రజ్యోతి): కమ్మ సేవా సమాఖ్య ఆధ్వర్యంలో సామాజిక సేవా కార్యక్రమాలు విస్తృతం చేసేందుకు కమ్మ సామాజిక మేధావులు, పెద్దలు ముందుకు రావాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. విజయవాడ గురునానక్‌ కాలనీలోని ఫన్‌టైమ్స్‌ రిక్రియేషన్‌ సెంటర్లో ఆదివారం ఆంధ్రప్రదేశ్‌ కమ్మ సేవాసమాఖ్య రాష్ట్రస్థాయి ప్రతినిధులు సమావేశం జరిగింది. కమ్మసేవా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు మండవ మురళీకృష్ణ మాట్లాడుతూ... కమ్మకులంలో ఐక్యత లేకపోవడం వల్ల అనేక కార్యక్రమాలు చేయడానికి సాధ్యపడడం లేదన్నారు. పెద్దలు, సభ్యుల సహకారంతో ఆర్థికంగా నిధులు సేకరించి మరిన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కేవలం కమ్మ కులానికే కాకుండా ఇతర వర్గాలలోని పేదలను గుర్తించి వారికి విద్య, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. రాబోయే రోజుల్లో అమరావతిలో రాష్ట్రస్థాయి కమ్మ భవన్‌ కార్యాలయ నిర్మాణం, డిజిటల్‌, భౌతిక గ్రంథాలయాలు ఏర్పాటుకు సమన్వయంతో ముందుకు వెళ్లాలని మురళీకృష్ణ పిలుపునిచ్చారు. అంతకుముందు మాజీ ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారక రామారావు విగ్రహానికి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షుడు గన్ని భాస్కరరావు, గూడూరు సత్యనారాయణ, సూరపనేని స్వరూప రాణి, మందలపు జగదీష్‌, గుమ్మడి రామకృష్ణ, కనమేడల శ్రీనివాస, బొర్రా గాంధీ, జీవీ రాయుడు, సామినేని కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 14 , 2025 | 03:01 AM