Buddhist Ashram Yoga: బౌద్ధ ఆరామం తొట్లకొండ పై యోగా
ABN , Publish Date - Jun 02 , 2025 | 03:55 AM
విశాఖపట్నం పరిధిలోని బౌద్ధ ఆరామం తొట్లకొండపై యోగాంధ్ర మాసోత్సవాలలో యోగాసనాలు నిర్వహించబడ్డాయి. మయన్మార్, కాంబోడియా బౌద్ధ గురువులు, కలెక్టర్ హరేంధిరప్రసాద్ సహా ఇతర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
పాల్గొన్న మయన్మార్, కాంబోడియా బౌద్ధ గురువులు
విశాఖపట్నం, జూన్ 1(ఆంధ్రజ్యోతి): ‘యోగాంధ్ర’ మాసోత్సవాల్లో భాగంగా ఆదివారం విశాఖపట్నం పరిధిలోని బౌద్ధ ఆరామం తొట్లకొండపై యోగాసనాలు వేశారు. ఉదయం 6.30 నుంచి 8 గంటల వరకు నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ హరేంధిరప్రసాద్‌తోపాటు విదేశాలకు చెందిన బౌద్ధ గురువులు రాజదమ్మ(మయన్మార్), బర్మరే(కాంబోడియా) పాల్గొన్నారు. అదేవిధంగా విశాఖకు చెందిన బౌద్ధ సంఘం సభ్యులు ధర్మచారితోపాటు జాయింట్ కలెక్టర్ కె. మయూర్ అశోక్, భీమిలి ఆర్డీవో సంగీత మాధుర్, నేవీ అధికారులు, బ్రహ్మకుమారి సంస్థ సభ్యులు, యోగా సంఘం ప్రతినిధులు, రాష్ట్ర పర్యాటక, ఆయుష్ శాఖ అధికారులు పాల్గొన్నారు.