Share News

Borugadda Remand Extension: బోరుగడ్డ రిమాండ్‌ పొడిగింపు

ABN , Publish Date - Apr 29 , 2025 | 05:42 AM

బోరుగడ్డ అనిల్‌ రిమాండ్‌ను మే 9వరకు పొడిగిస్తూ నరసరావుపేట కోర్టు ఉత్తర్వులు జారీచేసింది. మార్చి 24న ఈ కేసులో ఆయనను కోర్టు ప్రవేశపెట్టగా, సోమవారం మరో కేసులో కోర్టులో హాజరుపరిచారు

Borugadda Remand Extension: బోరుగడ్డ రిమాండ్‌ పొడిగింపు

నరసరావుపేట లీగల్‌, ఏప్రిల్‌ 28(ఆంధ్రజ్యోతి): రౌడీషీటర్‌ బోరుగడ్డ అనిల్‌ రిమాండ్‌ను మే 9వరకు పొడిగిస్తూ స్థానిక రెండవ అదనపు జూనియర్‌ సివిల్‌ న్యాయాధికారి ఎం.గాయత్రి సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌, మంత్రి లోకేశ్‌లపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఫిరంగిపురం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఆ కేసులో మార్చి 24న స్థానిక కోర్టులో బోరుగడ్డను ప్రవేశపెట్టగా న్యాయాధికారి రిమాండ్‌ విధించిన విషయం తెలిసిందే. మరో కేసులో అనంతపురం జిల్లా కారాగారంలో రిమాండ్‌ ఖైదీగా ఉన్న బోరుగడ్డను పోలీసులు సోమవారం నరసరావుపేట కోర్టులో హాజరుపరిచారు.


ఇవి కూడా చదవండి

Guntur Mayor Election: గుంటూరు మేయర్ ఎన్నిక.. వైసీపీ అభ్యర్థి నామినేషన్

Visakhapatnam Mayor: విశాఖ మేయర్‌ ఎన్నిక ఏకగ్రీవం

Read latest AP News And Telugu News

Updated Date - Apr 29 , 2025 | 05:42 AM