Share News

Bike Accident: అర్ధరాత్రి విషాదం.. కరెంట్ స్తంభాన్ని బైక్ ఢీకొట్టడంతో..

ABN , Publish Date - Dec 14 , 2025 | 11:35 AM

అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం ఎం.జగన్నాధపురం గ్రామ సమీపంలో అర్ధరాత్రి కరెంట్ స్తంభాన్ని ఢీకొన్న బైక్ ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. మృతులు స్థానిక చెర్లోపాలెం, గణపర్తి గ్రామాలకు చెందిన దుర్గ, ధనుష్‌గా గుర్తించారు.

Bike Accident: అర్ధరాత్రి విషాదం.. కరెంట్ స్తంభాన్ని బైక్ ఢీకొట్టడంతో..
Bike Accident

అనకాపల్లి జిల్లాలో పెను విషాదం చోటుచేసుకుంది. కరెంట్ స్తంభాన్ని బైక్ ఢీకొన్న సంఘటనలో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు తెలిపిన పూర్తి వివరాల్లోకి వెళితే.. చెర్లోపాలెం, గణపర్తి గ్రామాలకు చెందిన దుర్గ, ధనుష్‌లు అర్ధరాత్రి బైకుపై వెళుతూ ఉన్నారు. అచ్యుతాపురం మండలం, ఎం జగన్నాధపుం గ్రామ సమీపంలో బైకు ప్రమాదానికి గురైంది. వేగంగా వెళ్లి స్తంభాన్ని ఢీకొట్టింది. దీంతో ఆ ఇద్దరూ యువకులు అక్కడికక్కడే చనిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. దుర్గ, ధనుష్‌ల మృతదేహాలను అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.


గుడివాడలో భారీ అగ్ని ప్రమాదం

కృష్ణా జిల్లాలోని గుడివాడలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. నెహ్రూ చౌక్‌లోని షాపింగ్ కాంప్లెక్స్‌లో ఉన్న సెల్‌ఫోన్ షాపులో మొదటగా మంటలు చెలరేగాయి. కొద్దిసేపటికే ఆ మంటలు సెల్ ఫోన్ షాపు నుంచి పక్కన ఉన్న షాపులకు వ్యాపించాయి. కాంప్లెక్స్ పరిసర ప్రాంతాల్లో దట్టంగా పొగ అలుముకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజిన్లతో హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటల్ని ఆర్పడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. భారీ మంటలతో స్థానిక ఇళ్ల వారు భయాందోళనకు గురయ్యారు. ఇళ్లలోనుంచి రోడ్లపైకి వచ్చేశారు. ఈ ప్రమాదంలో భారీ ఆస్తి నష్టం సంభవించింది.


ఇవి కూడా చదవండి

భక్తులకు అలర్ట్.. సుప్రభాత సేవ రద్దు

వర్షం అంతరాయం.. టాస్ ఆలస్యం

Updated Date - Dec 14 , 2025 | 12:04 PM