Share News

బీసీలకు కేటాయింపులు రూ.2లక్షల కోట్లకు పెంచాలి

ABN , Publish Date - Feb 08 , 2025 | 04:08 AM

రూ.2 లక్షల కోట్లకు పెంచాలని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్‌ గోయల్‌కు జాతీయ బీసీ సంక్షేమ సంఘం నేతలు విజ్ఞప్తి చేశారు.

బీసీలకు కేటాయింపులు రూ.2లక్షల కోట్లకు పెంచాలి

  • కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌కు బీసీ నేతల విజ్ఞప్తి

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7(ఆంధ్రజ్యోతి): కేంద్ర బడ్జెట్‌లో బీసీలకు కేటాయింపులు రూ.2 లక్షల కోట్లకు పెంచాలని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్‌ గోయల్‌కు జాతీయ బీసీ సంక్షేమ సంఘం నేతలు విజ్ఞప్తి చేశారు. కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసేందుకు చొరవ తీసుకోవాలన్నారు. బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య, కన్వీనర్‌ గుజ్జ కృష్ణ అధ్వర్యంలో బీసీ నేతలు శుక్రవారం పార్లమెంటు భవనంలో కేంద్ర మంత్రితో భేటీ అయ్యారు. జనగణనలో కులగణన చేయాలని కోరారు.

Updated Date - Feb 08 , 2025 | 04:13 AM