Minister Pratap Rao: బీసీ హాస్టల్ విద్యార్థులకు ఆయుర్వేద ఆధారిత పోషకాహారం ఇవ్వండి
ABN , Publish Date - Jul 15 , 2025 | 03:51 AM
ఏపీలోని బీసీ హాస్టల్ విద్యార్థులకు ఆయుర్వేద ఆధారిత పోషకాహారం అందించాలని కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి ప్రతాప్ రావు..
కేంద్ర మంత్రికి సవిత వినతి
పెనుకొండ టౌన్, జూలై 14(ఆంధ్రజ్యోతి): ఏపీలోని బీసీ హాస్టల్ విద్యార్థులకు ఆయుర్వేద ఆధారిత పోషకాహారం అందించాలని కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి ప్రతాప్ రావు జాదవ్‌కు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత విన్నవించారు. ఢిల్లీలోని ఆయన కార్యాలయంలో సోమవారం కలిసి, బీసీ సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థుల ఆరోగ్య అభివృద్ధి కోసం ప్రతిపాదించిన ‘ప్రాజెక్ట్ ఆరోగ్య బాల ఆయుర్ ఆంధ్ర ఇనీషియేటివ్’పై సవిత వినతిపత్రం సమర్పించారు. ఈ ప్రాజెక్ట్ కింద పోషకాహార లోపంతో బాధపడుతున్న హాస్టల్ విద్యార్థులకు, కిషోర బాలికలకు అశ్వగంధ, శతావరి, బ్రహ్మి, తులసి, శంకు, పుష్పి వంటి ఆయుర్వేద మూలికలతో తయారైన హెర్బల్ న్యూట్రిషన్ సప్లిమెంట్ అందివ్వనున్నారని మంత్రి సవిత తెలిపారు.