Share News

World Book Of Records: వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో బాలకృష్ణకు చోటు.. సీఎం చంద్రబాబు ప్రశంసలు..

ABN , Publish Date - Aug 24 , 2025 | 08:41 PM

నందమూరి బాలకృష్ణకు లండన్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గోల్డ్ ఎడిషన్‌లో చోటు దక్కటంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. బాలకృష్ణపై ప్రశంసల జల్లులు కురిపించారు.

World Book Of Records: వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో బాలకృష్ణకు చోటు.. సీఎం చంద్రబాబు ప్రశంసలు..
World Book Of Records

హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ హీరో నందమూరి బాలకృష్ణ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌(World Book Of Records)లో చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే. బాలకృష్ణ అందిస్తున్న సేవలకుగానూ లండన్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గోల్డ్ ఎడిషన్‌లో చోటు దక్కింది. ఈ నేపథ్యంలోనే ఆగస్టు 30వ తేదీన హైదరాబాద్‌లో ఆయనకు సత్కారం జరగనుంది. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సాధించిన బాలకృష్ణను పలువురు ప్రముఖులు అభినందిస్తున్నారు. సోషల్ మీడియ వేదికగా ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు.


దేశ చలనచిత్ర చరిత్రలో సువర్ణ అధ్యాయం

నందమూరి బాలకృష్ణకు లండన్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గోల్డ్ ఎడిషన్‌లో చోటు దక్కటంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) స్పందించారు. బాలకృష్ణపై ప్రశంసల జల్లులు కురిపించారు. బాలకృష్ణ ప్రయాణం దేశ చలనచిత్ర చరిత్రలో సువర్ణ అధ్యాయంగా అభివర్ణించారు. సినిమా పట్ల బాలకృష్ణకు ఉన్న అంకితభావం వల్లే ఈ గుర్తింపు వచ్చిందని అన్నారు. చారిత్రాత్మక మైలురాయిని సొంతం చేసుకున్న బాలయ్యకు అభినందనలు తెలియజేశారు.


ఇవి కూడా చదవండి

రెచ్చిపోయిన యువతి.. పబ్లిక్‌గా మందు తాగొద్దన్నందుకు..

ఫాస్టాగ్ ఏడాది పాస్ ఇవి పాటించకుంటే రూ.3,000 లాస్

Updated Date - Aug 24 , 2025 | 09:24 PM