Share News

Awareness Campaign : హెల్మెట్‌... భారం కాదు భద్రత!

ABN , Publish Date - Feb 19 , 2025 | 05:39 AM

‘ఏవండోయ్‌ హెల్మెట్‌ మీ తలకు బరువు కాదు.. మన కుటుంబానికి భద్రత. సీటు బెల్ట్‌ ధరించండి.. క్షేమంగా మీ గమ్య స్థానాలకు చేరుకోండి’ అంటూ రహదారి భద్రతా మాసోత్సవాల సందర్భంగా...

Awareness Campaign : హెల్మెట్‌... భారం కాదు భద్రత!

ABN AndhraJyothy : ‘నాన్నా పది నిమిషాలు ఆలస్యమైనా పర్వాలేదు. క్షేమంగా ఇంటికి రండి’ అంటూ ఓ చిన్నారి కూతురు తండ్రి క్షేమం కోరుతోంది. ‘ఏవండోయ్‌ హెల్మెట్‌ మీ తలకు బరువు కాదు.. మన కుటుంబానికి భద్రత. సీటు బెల్ట్‌ ధరించండి.. క్షేమంగా మీ గమ్య స్థానాలకు చేరుకోండి’ అంటూ రహదారి భద్రతా మాసోత్సవాల సందర్భంగా పోలీసులు రకరకాల ఫ్లెక్సీలను ఏలూరు నగర వీధుల్లో ఏర్పాటు చేశారు. వీటిని చూసి వెళ్లడమే తప్ప.. వీటిని పాటించాలనే స్పృహ చాలా మందిలో కనిపించలేదనడానికి హెల్మెట్‌ లేకుండా సాగిస్తున్న ఈ ప్రయాణ దృశ్యాలే నిదర్శనం.

- ఏలూరు, ఆంధ్రజ్యోతి

Updated Date - Feb 19 , 2025 | 05:39 AM