Share News

Telugu States: విద్యార్థులకు గుడ్ న్యూస్..

ABN , Publish Date - Aug 06 , 2025 | 09:23 PM

విద్యార్థులకు గుడ్ న్యూస్. వారికి వరుసగా సెలవులు వచ్చాయి. దీంతో మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని పాఠశాలలు మూతపడనున్నాయి.

Telugu States: విద్యార్థులకు గుడ్ న్యూస్..

హైదరాబాద్, ఆగస్ట్ 06: విద్యార్థులకు గుడ్ న్యూస్. వారికి వరుసగా సెలవులు వచ్చాయి. దీంతో మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని పాఠశాలలు మూతపడనున్నాయి. ఆగస్ట్ 8వ తేదీ శ్రావణ శుక్రవారం, ఆగస్ట్ 9వ తేదీ రాఖీ పౌర్ణమి. అదీకాక ఆ రోజు రెండో శనివారం కూడా. ఇక ఆగస్ట్ 10 వ తేదీ ఆదివారం. దీంతో బడులు, కాలేజీలకు వరుసగా మూడు రోజులు సెలవులు ఇచ్చారు. అయితే వరుసగా స్కూళ్లకు సెలవులు రావడంతో.. పిల్లలతో వారి తల్లిదండ్రులు లాంగ్ టూర్ వెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. వరుసగా సెలవులు రావడంతో.. దూర ప్రాంతాలకు వెళ్లే రైళ్లకు సంబంధించిన రిజర్వేషన్లు లిస్ట్ భారీగా పెరిగింది.


మరోవైపు ఆగస్ట్ 15వ తేదీ స్వాతంత్ర దినోత్సవం. ఆ రోజు సైతం సెలవు దినమే. ఆగస్ట్ 16వ తేదీ శ్రీకృష్ణాష్టమి దీంతో శనివారం సెలవు వచ్చింది. ఇక ఆగస్ట్ 17వ తేదీ ఆదివారం. దీంతో ఈ వారంతోపాటు వచ్చే వారంలో సైతం శుక్ర, శని, ఆదివారాలు వరుసగా సెలవులు వచ్చాయి. ఆ రోజుల్లో సైతం తమ పిల్లలతో టూర్లు వెళ్లేందుకు తల్లిదండ్రులు సమాయత్తమవుతున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..

జీవీఎంసీ స్టాడింగ్ కమిటీ ఎన్నికల్లో స్తతా చాటిన కూటమి

ఏపీ కేబినెట్ భేటీ.. పలు కీలక నిర్ణయాలు

మరిన్నీ తెలుగు వార్తలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Aug 06 , 2025 | 10:10 PM