Quantum Valley Amaravati: క్వాంటం వ్యాలీతో మారనున్న రాష్ట్ర ముఖచిత్రం
ABN , Publish Date - Jul 18 , 2025 | 05:35 AM
వైసీపీ హయాంలో విదేశాలకు మనీల్యాండరింగ్ జరగ్గా.. కూటమి ప్రభుత్వంలో విదేశాల..
బయోడైవర్సిటీ చైర్మన్ నీలాయపాలెం
అమరావతి, జూలై 17 (ఆంధ్రజ్యోతి): వైసీపీ హయాంలో విదేశాలకు మనీల్యాండరింగ్ జరగ్గా.. కూటమి ప్రభుత్వంలో విదేశాల నుంచి క్వాంటం కంపెనీలు రాష్ట్రానికి క్యూ కడుతున్నాయని ఏపీ బయోడైవర్సిటీ చైర్మన్ నీలాయపాలెం విజయకుమార్ అన్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్ ముఖచిత్రం మారబోతోందని పేర్కొన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం విలేకరులతో ఆయన మాట్లాడారు. అమరావతి క్వాంటం వ్యాలీకి ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీలు క్యూ కడుతున్నాయని, భవిష్యత్తులో ఈ వ్యాలీ చరిత్ర సృష్టించడం ఖాయమన్నారు. గత ప్రభుత్వం అసలు క్వాంటం వ్యాలీని ఏపీలో ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని అడిగిన పాపాన పోలేదని, చంద్రబాబు సీఎం అయిన తర్వాతే క్వాంటం కంప్యూటింగ్‌లో రాష్ట్రం ముందుకు వచ్చిందన్నారు. ఆసియాలోనే మొట్టమొదటి క్వాంటం వ్యాలీని 2026 జనవరి 1న అమరావతిలో ప్రారంభం కానుందని, ఏపీ తన అతిపెద్ద క్వాంటం కంప్యూటర్ ఐబీఎం క్వాంటం సిస్టం-2ను స్థాపించనుందని పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Heavy Rains: భారీ వర్షం.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన వాహనాలు..
Heavy Rains: భారీ వర్షం.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన వాహనాలు..
CM Vs KTR: కేటీఆర్ మిత్రుడు దుబాయ్‌లో చనిపోయాడు: సీఎం రేవంత్