Share News

YogAndhra 2025: యోగాంధ్ర నిర్వహణకు అపెక్స్‌ కమిటీ

ABN , Publish Date - May 27 , 2025 | 05:40 AM

యోగాంధ్ర 2025 కార్యక్రమం పర్యవేక్షణ కోసం సీఎస్‌ విజయానంద్‌ నేతృత్వంలో అపెక్స్‌ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆరోగ్య శాఖ ప్రత్యేక సీఎస్‌ కృష్ణబాబు, కమిషనర్‌ వీరపాండియన్‌ కీలక బాధ్యతలు నిర్వర్తించనున్నారు.

YogAndhra 2025: యోగాంధ్ర నిర్వహణకు అపెక్స్‌ కమిటీ

చైర్మన్‌గా సీఎస్‌ విజయానంద్‌

కమిటీలో 13 మంది సీనియర్‌ ఐఏఎ్‌సలు

అమరావతి, మే 26(ఆంధ్రజ్యోతి): యోగాంధ్ర - 2025 పర్యవేక్షణకు, కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రభుత్వం అపెక్స్‌ కమిటీని నియమించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దీనికి చైర్మన్‌గా ఉంటారు. ఈ మేరకు సీఎస్‌ కె.విజయానంద్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కమిటీ యోగాంధ్రకు అవసరమైన వస్తువులు కొనుగోలుకు టెండర్‌ కమిటీని నియమించడం, అందుకు ప్రత్యేక మార్గదర్శకాలు సిద్ధం చేయడం వంటి పనులు నిర్వహిస్తుంది. ఈ కమిటీలో సీఎ్‌సతో పాటు ఆరోగ్య శాఖ స్పెషల్‌ సీఎస్‌, జీఏడీ ముఖ్య కార్యదర్శి, ఫైనాన్స్‌ ముఖ్య కార్యదర్శి, టూరిజం స్పెషల్‌ సీఎస్‌, సోషల్‌ ఎడ్యూకేషన్‌ సెక్రటరీ, ఐటీఈ అండ్‌ సీ ముఖ్య కార్యదర్శి, పంచాయతీరాజ్‌ ముఖ్య కార్యదర్శి, మున్సిపల్‌ శాఖ ముఖ్య కార్యదర్శి. రెవెన్యూ స్పెషల్‌ సీఎస్‌, పర్యాటక శాఖ స్పెషల్‌ సీఎస్‌, ఆరోగ్యశాఖ కమిషనర్‌ మెంబర్లుగా ఉంటారు. ఈ కమిటీకి ఆయుష్‌ కమిషనర్‌ మెంబర్‌ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు.

అధికారులకు విధులు...

యోగాంధ్రా నిర్వహణ బాధ్యతలను ఆరోగ్యశాఖ స్పెషల్‌ సీఎస్‌ ఎంటీ కృష్ణబాబుకు ప్రభుత్వం అప్పగించింది. ఆరోగ్య శాఖ కమిషర్‌ జి.వీరపాండియన్‌కు ప్రధాన మంత్రి కార్యక్రమం ఇన్‌చార్జిగా బాధ్యతలు అప్పగించారు. ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రి కార్యాలయాలతో సమన్వయం చేసుకోవడంతో పాటు ప్రోటోకాల్‌ ప్రకారం అన్ని ఏర్పాట్లు చూస్తారు.


ఇవి కూడా చదవండి..

PM Modi: నా బుల్లెట్ రెడీ.. పాక్‌కు మోదీ వార్నింగ్

మోదీ రోడ్‌షోలో కల్నల్ సోఫియా ఖురేషి కుటుంబసభ్యులు

జ్యోతి మల్హోత్రాకు ఆరుగురు పాక్ గన్‌మెన్‌ల సెక్యూరిటీ.. సాటి యూట్యూబర్‌కు షాక్

ఆపరేషన్ సిందూర్‌పై ముందుగానే పాక్‌కు లీక్‌.. పెదవి విప్పిన జైశంకర్

For National News And Telugu News

Updated Date - May 27 , 2025 | 05:40 AM