APEAPCET: ఏపీఈఏపీసెట్ రెండో విడత ర్యాంకుల కేటాయింపు
ABN , Publish Date - Jun 24 , 2025 | 04:03 AM
ఏపీఈఏపీసెట్-2025కు సంబంధించి ఇప్పటి వరకు ర్యాంకులు పొందకుండా ఉండి 10+2 గ్రూప్ మార్కులను డిక్లరేషన్ ఫారం లో అప్‌లోడ్ చేసిన ఇంటర్, ఇతర బోర్డుల విద్యార్థులకు రెండో విడత ర్యాంకులు కేటాయించినట్టు కన్వీనర్ ప్రొఫెసర్ వీవీ సుబ్బారావు తెలిపారు.
జేఎన్టీయూకే, జూన్ 23 (ఆంధ్రజ్యోతి): ఏపీఈఏపీసెట్-2025కు సంబంధించి ఇప్పటి వరకు ర్యాంకులు పొందకుండా ఉండి 10+2 గ్రూప్ మార్కులను డిక్లరేషన్ ఫారం లో అప్‌లోడ్ చేసిన ఇంటర్, ఇతర బోర్డుల విద్యార్థులకు రెండో విడత ర్యాంకులు కేటాయించినట్టు కన్వీనర్ ప్రొఫెసర్ వీవీ సుబ్బారావు తెలిపారు. ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి ఐసీఎ్‌సఈ, సీబీఎ్‌సఈ, ఏపీవోఎ్‌సఎస్, ఎన్‌ఐవోఎస్, ఆర్జీయూకేటీ, డిప్లొమా, ఇతర బోర్డులకు చెందిన విద్యార్థులకు సోమవారం ర్యాంకులు కేటాయించామన్నారు.