అమెరికా తీరు అమానుషం: తులసిరెడ్డి
ABN , Publish Date - Feb 08 , 2025 | 05:44 AM
భారతీయులను తిరిగి భారత్‌కు పంపడంలో అమెరికా అధికారులు వ్యవహరించిన తీరు గర్హనీయం, అమానుషమని...

వేంపల్లె, ఫిబ్రవరి 7(ఆంధ్రజ్యోతి): అమెరికాలో చట్టవిరుద్ధంగా నివసిస్తున్నారన్న సాకుతో 104 మంది భారతీయులను తిరిగి భారత్‌కు పంపడంలో అమెరికా అధికారులు వ్యవహరించిన తీరు గర్హనీయం, అమానుషమని ఏపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి తులసిరెడ్డి అన్నారు. వేంపల్లెలో శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ చేతులకు సంకెళ్లు వేసి, కాళ్లకు గొలుసులు కట్టి సైనిక రవాణా విమానంలో అమృత్‌సర్ విమానాశ్రయంలో 5వ తేదీన వదిలి వెళ్లారన్నారు. మెక్సికో ప్రభుత్వం తమ విమానాలు పంపి తమ వారిని గౌరవప్రదంగా తీసుకొచ్చిందని, కానీ, ఆ విధంగా మన దేశం చేయకపోగా.. కనీసం నిరసన కూడా తెలపకపోవడం ఆక్షేపణీయమని పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
NTR District: మరో వివాదంలో చిక్కుకున్న ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు..
Cabinet Decisions: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం.. విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్‍కు ఆమోదం