Deputy CM Pawan Kalyan:సోషల్ ఆడిట్‌కుసర్టిఫికెట్ కోర్సు
ABN , Publish Date - Jul 17 , 2025 | 04:26 AM
సోషల్ ఆడిట్ నిర్వహణలో ఎన్ని ఆడిట్‌లు పూర్తి చేశామనేది కాకుండా ఎంతమేర మార్పులు తీసుకొచ్చామన్నదే ముఖ్యమని డిప్యూటీ సీఎం ఓఎ్‌సడీ వెంకటకృష్ణ అన్నారు.
సెప్టెంబరు నుంచి ఇంజనీరింగ్ విద్యార్థులకు శిక్షణ
అమరావతి, జూలై 16(ఆంధ్రజ్యోతి): సోషల్ ఆడిట్ నిర్వహణలో ఎన్ని ఆడిట్‌లు పూర్తి చేశామనేది కాకుండా ఎంతమేర మార్పులు తీసుకొచ్చామన్నదే ముఖ్యమని డిప్యూటీ సీఎం ఓఎస్డీగా వెంకటకృష్ణ అన్నారు. బుధవారం మంగళగిరిలోని హ్యాపీ రిసార్ట్స్‌లో జాతీయ సోషల్ ఆడిట్ వర్క్‌షాపును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సోషల్ ఆడిట్‌ను అన్ని శాఖలకు విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. సోషల్ ఆడిట్‌కు సంబంధించి సర్టిఫికెట్ కోర్సును ఏపీలో ప్రారంభించాలని ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ భావిస్తున్నారని తెలిపారు. ఈ కోర్సులో భాగంగా ఇంజనీరింగ్ విద్యార్థులకు సెప్టెంబరు నుంచి శిక్షణ ప్రారంభిస్తామని చెప్పారు. జాతీయ స్థాయిలో ఈ శిక్షణ అందించే సంస్థలకు ఏపీ వేదిక కానుందన్నారు. దేశంలో మొదటగా సోషల్ ఆడిట్ ప్రారంభించి ఇతర రాష్ట్రాలకు ఏపీ ఆదర్శంగా నిలిచిందని ఏపీ సోషల్ ఆడిట్ డైరెక్టర్ శ్రీకాంత్ అన్నారు. సోషల్ ఆడిట్ సిబ్బందిని ఉపాధి హామీ కార్మికుల కుటుంబాల నుంచి ఎంపిక చేశామని, గ్రామాల్లో ప్రజా ఆడిట్ నిర్వహించడంలో సఫలీకృతమయ్యామని వివరించారు. సోషల్ ఆడిట్‌కు కేంద్రం ఇచ్చే నిధులను పొదుపుగా వాడుకుంటున్నామని తెలిపారు. ప్రతి గ్రామసభను డాక్యుమెంటేషన్ చేస్తున్నామని, మండల సభలను లైవ్ ఇచ్చి సోషల్ ఆడిట్‌ను పారదర్శకంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ కన్సల్టెంట్ జి.సుస్మిత, ఎన్‌ఐఆర్‌డీ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎస్.శ్రీనివాస్ పాల్గొన్నారు.