-
-
Home » Andhra Pradesh » ap telanagana news along with Montha Cyclone live and fast updates here vreddy
-
LIVE UPDATES: హడలెత్తిస్తున్న మొంథా తుఫాన్..
ABN , First Publish Date - Oct 30 , 2025 | 06:59 AM
మొంథా తుఫాన్.. ఈ పేరు ఇప్పుడు ఏపీతో పాటు తెలంగాణ ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తోంది. భయపెడుతున్న ఈ తుఫాన్ అప్డేట్స్.. ఎప్పటికప్పుడు మీ ముందుకు..
Live News & Update
-
Oct 30, 2025 20:34 IST
రెండో ప్రమాద హెచ్చరిక జారీ
ప్రకాశం బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
బ్యారేజీకి పెరిగిన వరద ఉదృతి
బ్యారేజీకి 5 లక్షల 87 వేల క్యూసెక్కులు వరద
వరద మొత్తాన్ని కిందకు విడుదల చేస్తున్న అధికారులు
బ్యారేజ్ దిగువ భాగాన ఉన్న లంక గ్రామాలను అప్రమత్తం చేసిన అధికారులు
-
Oct 30, 2025 20:30 IST
వాగులో కొట్టుకుపోయిన భార్యాభర్తలు..
అబ్దుల్లాపూర్ మెట్టు బాటసింగారం పెద్ద వాగులో భార్యాభర్తల గల్లంతు..
బైకుపై వాగు దాటుతుండగా కొట్టుకుపోయిన భార్యాభర్తలు..
భార్య కృష్ణవేణి మృతి, భర్తను రక్షించిన స్థానికులు..
ఇబ్రహీంపట్నం నేర్రపల్లి గ్రామంలోని అమ్మగారింటి నుండి భువనగిరి వెళుతుండగా జరిగిన ప్రమాదం
-
Oct 30, 2025 20:26 IST
తుఫాన్ నష్టంపై ప్రాథమిక నివేదిక
మొంథా తుఫాన్ నష్టంపై తెలంగాణ వ్యసాయ శాఖ ప్రాథమిక నివేదిక
4,47,864 ఎకరాల్లో పంట నష్టం
2,53,033 మంది రైతులపై ప్రభావం
వరి పంట – 2,82,379 ఎకరాలు నష్టం
పత్తి పంట – 1,51,707 ఎకరాలు నష్టం
వరంగల్ జిల్లా – 1,30,200 ఎకరాల్లో నష్టం
ఖమ్మం జిల్లా – 62,400 ఎకరాల్లో నష్టం
నల్గొండ జిల్లా – 52,071 ఎకరాల్లో నష్టం
మొత్తం 12 జిల్లాలు, 179 మండలాల్లో పంట నష్టం నమోదు
పూర్తి స్థాయి సర్వేతో నష్టం ఇంకా పెరిగే అవకాశం
నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటాం: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
వరద ప్రభావిత జిల్లాల్లో త్వరలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన
ఎకరాకు పరిహారం అంశంపై సీఎం రేవంత్‌తో చర్చించి నిర్ణయం
-
Oct 30, 2025 18:51 IST
వాగులో కొట్టుకుపోయిన 80 గొర్రెలు
జనగామ : నర్మెట్ట మండలంలో వాగు దాటిస్తుండగా కొట్టుకుపోయిన 80 గొర్రెలు
వెల్దండలో నిన్న రాత్రి ఘటన..
గ్రామానికి చెందిన బాధితులు పంతంగి చంద్రమౌళి, ఓడాల యాదయ్యకు రూ.10 లక్షల వరకు నష్టం.
-
Oct 30, 2025 17:49 IST
ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద నీరు
విజయవాడ: ప్రకాశం బ్యారేజీకి భారీగా చేరుకున్న వరద నీరు...
70 గేట్లను ఎత్తి.. 5,38,867 క్యూసెక్కుల నీటిని విడుదల...
ప్రస్తుత బ్యారేజ్ లెవెల్ 14.4, అన్ని కాలువలను మూసేసిన అధికారులు...
లంక గ్రామ ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు..
ముందస్తు జాగ్రత్తగా పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసిన అధికారులు.
-
Oct 30, 2025 17:09 IST
వరదల్లో చిక్కుకుని వ్యక్తి మృతి
హనుమకొండ : వరదల్లో చిక్కుకుని రిటైర్డ్ R&B DEE పాక శ్రీనివాస్ మృతి
సమ్మయ్య నగర్ కాలనీలోని టీవీ టవర్స్ వద్ద వరదల్లో చిక్కుకున్న శ్రీనివాస్
మధ్యాహ్నం బయటకు వచ్చిన పాక శ్రీనివాస్ వరదల చిక్కుకొని గల్లంతు
కొద్దిసేపటి క్రితమే మృతదేహం లభ్యం
-
Oct 30, 2025 17:04 IST
హనుమకొండలో ఉద్రిక్తత
హనుమకొండలోని సమ్మయ్యనగర్ వద్ద ఉద్రిక్తత
GWMC కమిషనర్ చాహత్ , మేయర్ సుధారాణి వాహనాలను అడ్డుకున్న వరద బాధితులు
రోడ్డుపై బైఠాయించి నిరసన, తులసి బార్ దగ్గర గేట్లు ఓపెన్ చేయాలని డిమాండ్
గోపాల్పూర్ చెరువు మత్తడి వద్ద గేట్లు మూసివేయడంతోనే గండిపడి వరద తీవ్రత పెరిగింది: సమ్మయ్య నగర్ వాసులు
అధికారులు ముందస్తు చర్యలు చేపడితే ఈ పరిస్థితులు ఉండేవి కావు: సమ్మయ్య నగర్ వాసులు
-
Oct 30, 2025 15:51 IST
సింగూరు ప్రాజెక్టుకు పెరిగిన వరద
సంగారెడ్డి జిల్లా సింగూరు ప్రాజెక్టుకు పెరిగిన వరద
మూడు గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్న అధికారులు
ఇన్ ఫ్లో- 21,935 క్యూసెక్కులు
ఔట్ ఫ్లో- 26,313 క్యూసెక్కులు
ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం - 29.917 టీఎంసీలు
ప్రస్తుతం ప్రాజెక్టులో ఉన్న నీటి నిల్వ - 17. 213 టీఎంసీలు
-
Oct 30, 2025 13:40 IST
-
Oct 30, 2025 13:10 IST
తీవ్ర అల్పపీడనంగా మారిన మొంథా తుఫాన్
దక్షిణ ఛత్తీస్‌గఢ్ పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతం
గంటకు 18 కి.మీ.వేగంతో కదులుతున్న తీవ్ర అల్పపీడనం
వచ్చే 12 గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశం
-
Oct 30, 2025 12:32 IST
కృష్ణా: అవనిగడ్డ నియోజకవర్గం కోడూరులో డిప్యూటీ సీఎం పవన్ పర్యటన
మొంథా తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న పంటలను పరిశీలించిన పవన్ కల్యాణ్
పంటలు దెబ్బతిని నష్టపోయిన రైతులను పరామర్శించిన డిప్యూటీ సీఎం పవన్
తుఫాన్ తమను ముంచేసిందని డిప్యూటీ సీఎం ఎదుట ఆవేదన వ్యక్తం చేసిన రైతులు
అవనిగడ్డ సబ్ స్టేషన్ వద్ద తుఫాన్ ఎఫెక్ట్ దృశ్యాలతో కూడిన ఫొటో ఎగ్జిబిషన్ పరిశీలన
-
Oct 30, 2025 12:29 IST
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన..
-
Oct 30, 2025 12:28 IST
ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటన
భారీ వర్షాలకు పెరుగుతున్న కృష్ణా వరద ప్రవాహం
పులిచింతల, ప్రకాశం బ్యారేజీల నుంచి నీరు దిగువకు విడుదల
ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 2.74 లక్షల క్యూసెక్కులు
5 లక్షల క్యూసెక్కులకు చేరనున్న వరద ప్రవాహం క్రమంగా తగ్గే అవకాశం
లంక గ్రామలు సహా లోతట్టు ప్రాంతాల వాసులు అప్రమత్తం ఉండాలని సూచన
-
Oct 30, 2025 11:31 IST
హైదరాబాద్: మొంథా తుఫాన్ ఎఫెక్ట్‌పై నేడు సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
భేటీకి హాజరుకానున్న కలెక్టర్లు, ఇన్‌ఛార్జ్ మంత్రులు, ఉన్నతాధికారులు
తుఫాన్ ఎఫెక్ట్‌తో జరిగిన నష్టం, సహాయక చర్యలపై జరగనున్న చర్చ
-
Oct 30, 2025 11:12 IST
అమరావతి: తుఫాన్‌తో రహదారులకు జరిగిన నష్టంపై ఆర్ అండ్ బీ శాఖ ఫోకస్
పూర్తిస్థాయి నివేదికను రూపొందించాలని మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి ఆదేశం
రహదారుల ధ్వంసంపై అంచనా వేసి, నష్టం వివరాలు సమర్పించాలని ఆదేశం
తుఫాన్ తీవ్రత తగ్గినందున వేగంగా పునరుద్ధరణ పనులు చేపట్టాలని ఆదేశాలు
-
Oct 30, 2025 11:12 IST
కర్నూలు జిల్లాలో మొంథా తుఫాన్ ఎఫెక్ట్
హోలగుంద, కోసిగి, మంత్రాలయం మండలాల్లో దెబ్బతిన్న పంటలు
ఆలూరు, చిప్పగిరి మద్దికేర మండలాల్లోని 1469 హెక్టార్లలో పంటనష్టం
-
Oct 30, 2025 11:11 IST
ఎన్టీఆర్: నందిగామలోని ఉధృతంగా మున్నేరు వాగు ఉధృతి
పెద్దబ్రిడ్జి దగ్గర మున్నేటి ప్రవాహాన్ని పరిశీలించిన అధికారులు
ఏనుగుగడ్డ వాగుకు భారీగా వరద, పొంగి పొర్లుతున్న వాగు
చిలుకూరు, దాములూరు, కొత్తపేటకు నిలిచిన రాకపోకలు
విస్సన్నపేటలో అదుపుతప్పి కల్వర్టులో దూసుకెళ్లిన కంటైనర్
-
Oct 30, 2025 10:05 IST
-
Oct 30, 2025 10:03 IST
-
Oct 30, 2025 09:15 IST
-
Oct 30, 2025 08:37 IST
వరంగల్ లో కుండపోత వాన..వరదలో పలు కాలనీలు
-
Oct 30, 2025 08:15 IST
విశాఖ జిల్లాలో నేడు స్కూల్స్, అంగన్వాడీలకు సెలవు
తుఫాన్ దృష్ట్యా విద్యాసంస్థలకు సెలవు ప్రకటించిన కలెక్టర్
-
Oct 30, 2025 08:14 IST
మొంథా తుఫాన్ దృష్ట్యా ఇవాళ 6 రైళ్లు రద్దు: ద.మ.రైల్వే
నేడు 12 రైళ్లు దారి మళ్లింపు: ద.మ.రైల్వే
-
Oct 30, 2025 07:19 IST
ములుగు, మహబూబాబాద్, సిద్ధిపేట జిల్లాలో విద్యా సంస్థలకు సెలవు
నేడు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు సెలవు
-
Oct 30, 2025 07:18 IST
వరంగల్, హన్మకొండ జిల్లాలకు మరో 24 గంటలు రెడ్ అలర్ట్
నేడు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించిన కలెక్టర్లు
ఇళ్ల నుంచి ప్రజలు బయటకు రావొద్దని అధికారుల సూచన
సహాయక చర్యల కోసం రంగంలోకి దిగిన NDRF బృందాలు
లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రదేశాలకు తరలింపు
-
Oct 30, 2025 07:18 IST
తెలంగాణలోని 8 జిల్లాలకు రెడ్, 7 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
జనగామ, వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్,..
సిద్దిపేట, యాదాద్రి, కరీంనగర్, సిరిసిల్ల జిల్లాలకు రెడ్ అలర్ట్
ఆదిలాబాద్, నిర్మల్, సూర్యాపేట, జగిత్యాల, మంచిర్యాల,..
పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాలకు అతిభారీ వర్ష సూచన
-
Oct 30, 2025 07:18 IST
అల్లూరి : పాడేరులో కొనసాగుతున్న మొoథా
పాడేరు నుంచి విశాఖకు వెళ్లే మార్గంలో వంజంగి కాంతమ్మ వ్యూ పాయింట్ సమీపంలో విరిగిపడిన కొండచరియలు
వాహన రాకపోకలు బంద్
ప్రయాణికులు గమనించాలని సమాచారం అందించిన స్థానికులు
-
Oct 30, 2025 07:07 IST
అరేబియా సముద్రంలో మరో అల్పపీడనం
తెలంగాణకు అతి భారీ వర్ష సూచన
కోస్తాంధ్ర, రాయలసీమ, విదర్భకు భారీ వర్ష సూచన
-
Oct 30, 2025 07:07 IST
ప్రస్తుతం తీవ్ర అల్పపీడనంగా మారిన మొంథా తుఫాన్
దక్షిణ ఛత్తీస్‌గఢ్ పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతం
గంటకు 18 కి.మీ.వేగంతో కదులుతున్న తీవ్ర అల్పపీడనం
వచ్చే 12 గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశం