Share News

Nara Lokesh Investopia Speech: డేటా విప్లవాన్ని అందిపుచ్చుకుంటున్నాం

ABN , Publish Date - Jul 24 , 2025 | 02:54 AM

డేటా విప్లవం ద్వారా అంతర్జాతీయంగా వచ్చే అవకాశాలను అందిపుచ్చుకోవడంలో ఆంధ్రప్రదేశ్‌ ముందు

Nara Lokesh Investopia Speech: డేటా విప్లవాన్ని అందిపుచ్చుకుంటున్నాం

  • యూఏఈ ఆదర్శంగా ఏఐ సాంకేతికత

  • ‘ఇన్వెస్టోపియా గ్లోబల్‌-ఆంధ్రప్రదేశ్‌’ సదస్సులో మంత్రి లోకేశ్‌

అమరావతి, జూలై 23(ఆంధ్రజ్యోతి): డేటా విప్లవం ద్వారా అంతర్జాతీయంగా వచ్చే అవకాశాలను అందిపుచ్చుకోవడంలో ఆంధ్రప్రదేశ్‌ ముందు వరుసలో నిలుస్తోందని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలకా్ట్రనిక్స్‌ శాఖల మంత్రి నారా లోకేశ్‌ అన్నారు. యూఏఈని ఆదర్శంగా తీసుకుని ఏఐ సాంకేతికతను వినియోగిస్తున్నామని చెప్పారు. బుధవారం విజయవాడలో నిర్వహించిన ‘ఇన్వెస్టోపియా గ్లోబల్‌-ఆంధ్రప్రదేశ్‌’ సదస్సులో ‘ఫైర్‌ సైడ్‌ చాట్‌’ అంశంపై జీ42 ఇండియా సీఈవో మనూజైన్‌ నిర్వహించిన చర్చలో ఆయన పాల్గొన్నారు. దక్షిణాసియాలో తొలి 152 బిట్‌ క్వాంటమ్‌ కంప్యూటర్‌ ఏపీ రాజధాని అమరావతిలో ఏర్పాటయ్యే వ్యాలీలో జనవరిలో ఆవిష్కృతం కాబోతోందని, ఇది మొత్తం ఎకో సిస్టమ్‌ను మార్చబోతోందని తెలిపారు. విశాఖపట్నం డేటా సిటీగా అభివృద్ధి చెందుతుందన్నారు. పలు ప్రఖ్యాత సంస్థలు విశాఖలో డేటా సెంటర్లను ఏర్పాటు చేయడానికి ముందుకు వస్తున్నాయని వివరించారు. అంతర్జాతీయ మార్పులకు అనుగుణంగా పాలిటెక్నిక్‌, డిగ్రీ, ఇంజనీరింగ్‌ విద్యలో ఏఐ స్కిల్‌ డెవల్‌పమెంట్‌ ప్రోగ్రామ్‌లను ప్రవేశపెడుతున్నామన్నారు. పరిపాలనలోనూ ఏఐ వినియోగం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలందించడంపై తమ ప్రభుత్వం దృష్టి సారించిందని తెలిపారు. ఏఐతో ఉద్యోగాలు కోల్పోరని, ప్రతి పారిశ్రామిక విప్లవం కొత్త ఉద్యోగాలు సృష్టిస్తుందని చెప్పారు. యూఏఈ-ఆంధ్రప్రదేశ్‌ పరస్పర సహకారంతో డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థను శక్తివంతం చేయాలని భావిస్తున్నామన్నారు. తనకు ఇష్టమైన ఏఐ అప్లికేషన్‌ చాట్‌జీపీటీ అని లోకేశ్‌ చెప్పారు. రెన్యూవబుల్‌ ఎనర్జీ, ఇన్ర్ఫా, డిజిటల్‌ గవర్నెన్స్‌, ఏఐ ఫస్ట్‌ యూనివర్సిటీ, జీనోమ్‌ సీక్వెన్సింగ్‌, క్వాంటమ్‌ వ్యాలీ, లాజిస్టిక్స్‌ రంగాల్లో పెట్టుబడులకు సంబంధించి యూఏఈ మంత్రి అబ్దుల్లా బిన్‌ తౌఖ్‌ అల్‌ మర్రితో చర్చించారు. ఆయా రంగాల్లో పెట్టుబడులకు సహకరించాలని కోరారు. యూఏఈ పర్యటనకు రావాలని లోకేశ్‌ను మంత్రి ఆహ్వానించారు.

Also Read:

దోసకాయను ఉప్పుతో తింటున్నారా? ఈ ముఖ్య విషయం తెలుసుకోండి.!

శరీరంలో కనిపించే ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి.. లేదంటే..!

For More Health News

Updated Date - Jul 24 , 2025 | 02:54 AM